Sweeper to Manager: ఒకప్పుడు బ్యాంకులో స్వీపర్‌.. ఇప్పుడు మేనేజర్‌! ఈ మహిళ సక్సెస్ స్టోరీ ఇదే

Pratiksha Tondwalkar SBI Sweeper to Assistant General Manager. పట్టుదల, దృఢ సంకల్పం ఉంటే.. ఎంతటి లక్ష్యమైనా సాధించవచ్చని ప్రతీక్ష తోండ్‌వాల్కర్ అనే ఓ సాధారణ మహిళ నిరూపించారు.  

Written by - P Sampath Kumar | Last Updated : Aug 2, 2022, 01:20 PM IST
  • ఒకప్పుడు బ్యాంకులో స్వీపర్‌
  • ఇప్పుడు మేనేజర్‌
  • ఈ మహిళ సక్సెస్ స్టోరీ ఇదే
Sweeper to Manager: ఒకప్పుడు బ్యాంకులో స్వీపర్‌.. ఇప్పుడు మేనేజర్‌! ఈ మహిళ సక్సెస్ స్టోరీ ఇదే

Pratiksha Tondwalkar SBI Sweeper to Assistant General Manager: ఈ భూ ప్రపంచంలో ఉన్న వారందికీ కష్టాలు ఉంటాయి. వాటిని దైర్యంగా ఎదుర్కొని ముందుకుసాగిన వారే ఉన్నత స్థానాలకు చేరుతారు. ఇలా వచ్చిన వారిని మనం సినిమా, క్రీడా, వ్యాపారంగంలో ఎందరినో చూశాం. వారిని మనం ఆదర్శంగా తీసుకుంటున్నాం. పట్టుదల, దృఢ సంకల్పం ఉంటే.. ఎంతటి లక్ష్యమైనా సాధించవచ్చని ప్రతీక్ష తోండ్‌వాల్కర్ అనే ఓ సాధారణ మహిళ నిరూపించారు. ఒకప్పుడు బ్యాంకులో స్వీపర్‌గా పని చేసిన ఆమె.. ఎన్నో కష్టాలను దాటుకుని ఇప్పుడు అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా ఉన్నారు. మరో రెండేళ్లో రిటైర్‌ కూడా కాబోతున్నారు. ప్రతీక్ష సక్సెస్ స్టోరీ ఏంటో ఓసారి చూద్దాం. 

ప్రతీక్ష తోండ్‌వాల్కర్ 1964లో పూణేలోని ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు. చిన్నతనం నుంచే ఎన్నో కష్టాలు. అమ్మాయి భారం తగ్గించుకోవాలని 17 ఏళ్ల వయసులోనే సదాశివ కడు అనే వ్యక్తితో ప్రతీక్షకు పెళ్లి చేశారు ఆమె తల్లిదండ్రులు. దాంతో ఆమె పాఠశాల విద్య మధ్యలోనే ఆగిపోయింది. సదాశివ ఎస్‌బీఐ బ్యాంకులో బుక్‌ బైండర్‌. వచ్చిన జీతంతో సరిపెట్టుకునేవారు. పెళ్లైన ఏడాదికి ప్రతీక్షకు  మగబిడ్డ జన్మించాడు. బంధువుల గ్రామానికి వెళ్తుండగా సదాశివ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దాంతో ప్రతీక్ష 20 ఏళ్ల వయసులోనే భర్తను కోల్పోయి కష్టాలను ఎదుర్కొన్నారు.

ప్రతీక్షకు సరైన విద్యార్హతలు లేకపోవడంతో ఉద్యోగం దొరక్క ఇబ్బంది పడ్డారు. కుటుంబ పోషణ కోసం భర్త పనిచేసే ఎస్‌బీఐ బ్యాంకు వద్దకు వెళ్లి సాయం చేయమని కోరగా.. స్వీపర్‌గా ఉద్యోగం ఇచ్చారు. బ్యాంకులో పనిచేసే ఉద్యోగులను చూసి తాను ఆ స్థాయికి చేరాలని నిర్ణయించుకున్నారు. అయితే ఓవైపు బిడ్డ, మరోవైపు విద్యా అర్హత ఆమెకు ప్రతికూలంగా మారాయి. బంధువులు, స్నేహితు సాయంతో బుక్స్ కొనుక్కుని చదువుకుని టెన్త్‌ పాసయ్యారు. బ్యాంకు ఉద్యోగం రావాలంటే.. ఇంటర్మీడియెట్‌ కూడా పాసవ్వాలి. తాను కాలేజ్‌కి వెళ్తే కొడుకుని చూసుకోవడం కష్టమైపోతుందని.. బ్యాంక్‌ పరీక్షలు రాయమని తనను ప్రోత్సహించిన ప్రమోద్ తోండ్‌వాల్కర్‌ను వివాహం చేసుకున్నారు. 

ప్రతీక్ష పగలు పనులు చేసుకుంటూ.. రాత్రిళ్లు నైట్‌ కాలేజ్‌కి వెళ్లేవారు. అలా ఇంటర్‌, డిగ్రీ పూర్తి (1995లో) చేశారు. ఆ తర్వాత బ్యాంకు పరీక్షలు రాసి క్లర్క్‌గా ఉద్యోగాన్ని సంపాదించారు. 2004లో ట్రైనీ ఆఫీసర్‌గా పదోన్నతి పోంది.. ఆపై ఉన్నత పదవులను పొందారు. ప్రస్తుతం ఆమె అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌గా ఉన్నారు. మరో రెండేళ్లో రిటైర్‌ అవుతున్నారు. ప్రతీక్ష సంకల్పం, అంకితభావం మరియు చిత్తశుద్ధితో సాధించిన విజయాలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమెను సత్కరించింది. ప్రతీక్ష ఎస్‌బీఐతో 37 ఏళ్ల కెరీర్ కొనసాగుతోంది. ఎన్నో కష్టాలను దాటి ఉన్నత స్థాయికి చేరిన ప్రతీక్ష ఎంత మందికో ఆదర్శంగా నిలుస్తున్నారు. 

Also Read: Rohit Sharma: అందుకే అవేశ్‌ ఖాన్‌కు చివరి ఓవర్ ఇచ్చా.. విమర్శలపై స్పందించిన రోహిత్ శర్మ!

Also Read: పనస పండ్ల కోసం ఏనుగు తిప్పలు.. ఏకంగా చెట్టు ఎక్కి మరీ తెంపిందిగా (వీడియో)

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News