Telangana BJP: తెలంగాణ బీజేపీ నోటికి తాళం వేసిందెవరు..?
Telangana BJP: తెలంగాణపై భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆలోచన ఏంటి ..? భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ పాలిటిక్స్ ఎలా ఉండబోతున్నాయి..! ఓవైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరికలు జోరందుకుంటున్నాయి. కానీ బీజేపీ మాత్రం ఎందుకు సైలెంట్ మోడ్ లో ఉండిపోయింది. ఆ నిశ్శబ్దదం వెనుక ఏదైనా సీక్రెట్ దాగి ఉందా..! కాషాయ వర్గాలు చేరికలపై కామ్ గా ఉండటానికి కారణాలేమిటి..! ఇంతకీ తెలంగాణ పొలిటికల్ సర్కిల్ లో ఎలాంటి చర్చ జరుగుతోంది.
Telangana BJP : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇక్కడ రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించాయి. గత పదేళ్లుగా తెలంగాణ పొలిటికల్ వేను గమనిస్తే.. చాలా ఆసక్తికర అంశాలు కనిపిస్తున్నాయి. స్వరాష్ట్రం ఏర్పడ్డాక ఫస్ట్ టైమ్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్ర ఏర్పాటుకు టీఆర్ఎస్ పోరాడింది అని ప్రజలు నమ్మి ఆ పార్టీకీ రెండు సార్లు అధికారాన్ని కట్టబెట్టారు. అదే సమయంలో తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ ను ప్రజలు మాత్రం రెండు సార్లు తిరస్కరించారు. గతంలో జరిగిన రెండు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కనీస పోటీ ఇవ్వలేదు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సే, తెలంగాణ వచ్చింది సోనియా దయతోనే అని కాంగ్రెస్ ఎంత ప్రచారం చేసినా ప్రజలు మాత్రం ఎందుకో ఆదరించలేదు. బీఆర్ఎస్ నే ప్రజలు విశ్వసించారు.
అయితే ఇదంతా గతం ఇప్పుడు పరిస్థితులు మారాయి. మొన్న జరిగిన ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ క తెలగాణ ఓటర్లు పట్టం కట్టారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గవర్మెంట్ ఫామ్ చేసింది. అయితే ఇక్కడే మనం ఒక విషయాన్ని గ్రహించాలి. తెలంగాణలో ఎంత సేపు పోటీ బీఆర్ఎస్ , కాంగ్రెస్ మధ్యే ఉంటుందని అందరూ భావించారు. కానీ ఇదే క్రమంలో కాషాయ పార్టీ కూడా చాప కింద నీరులా విస్తరిస్తూ వచ్చింది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో దానిని అడ్వంటేజ్ గా తీసుకున్న తెలంగాణ బీజేపీ పార్టీనీ బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రచించింది. ఒక రకంగా బీజేపీ అనుకున్న స్థాయిలోనే తెలంగాణలో ఓటు బ్యాంకును సాధించుకుందనే చెప్పాలి.
ఇక 2014లో కేవలం ఒక లోక్ సభ సీటుకు మాత్రమే పరిమితమైన బీజేపీ.. అదే 2019 ఎన్నికలు వచ్చే సరికి సుమారు 18 శాతంకు పైగా ఓట్లు సాధించడమే కాకుండా 4 సీట్లు సాధించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఏకంగా 3 ఎంపీ స్థానాలు బీజేపీ గెలిచింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ స్థానంలో కాషాయ జెండా ఎగరవేయడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. దీంతో తెలంగాణలో పార్టీకీ మంచి అవకాశాలు ఉన్నాయని గుర్తించిన భారతీయ జనతా పార్టీ అదే స్థాయిలో పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టింది. అంతే కాదు పార్టీలోకి ముఖ్య నాయకులను చేర్చుకునే పని చేసింది. రఘు నందన్ రావు, ఈటెల రాజేందర్, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి లాంటి తెలంగాణలో మంచి పట్టు ఉన్న నేతలను తమ పార్టీలో చేర్చుకుంది. దీంతో తెలంగాణలో బీజేపీకీ కొంత ఊపు వచ్చింది.
ఇదే క్రమంలో బండి సంజయ్ కు పార్టీ పగ్గాలు అప్పజెప్పాక పార్టీ పరిస్థితి మరింత మెరుగైంది. అటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో దాదాపు గెలిచేంత పని చేసింది. జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ దూకుడుకు బీజేపీ అడ్డుకట్ట వేసింది. ఇదే దూకుడు కొనసాగిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో మంచి ఫలితాలు వస్తాయని బీజేపీ ఆశించింది.. అసలు ఏం జరిగిందో తెలియదు కానీ బీజేపీ అంతర్గత రాజకీయాలతో బండి సంజయ్ అధ్యక్షుడిగా తప్పించి కిషన్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర సారధ్య బాధ్యతలు అప్పగించారు. కిషన్ రెడ్డి నేతృత్వంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన బీజేపీ అనుకున్న స్థాయిలో సీట్లు సాధించకున్నా ఓటింగ్ శాతాన్ని మాత్రం బాగా పెంచుకుంది. కాకపోతే గతంలో ఎప్పుడూ లేనట్టుగా బీజేపీ ఏకంగా 8 శాసనసభ స్థానాలను గెలుచుకుంది.
అయితే బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉంటే మరిన్ని సీట్లు వచ్చి ఉండేవని పార్టీలోని ఓ వర్గం బహిరంగానే ఆరోపణలు చేసింది. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక కొద్ది నెలల్లోనే తెలంగాణలో మరో ఎన్నికకు రంగం సిద్దమైంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ సీట్లు సాధించాలనే లక్ష్యంతో ప్రచారం నిర్వహించింది. అనుకున్నట్లుగానే బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలిచి తెలంగాణలో చరిత్ర సృష్టించింది. అధికార కాంగ్రెస్ తో పోటా పోటీగా నిలబడి 8 సీట్లు సాధించి మరో సారి తెలంగాణలో తమ పార్టీ సత్తా ఏంటో బీజేపీ స్పష్టం చేసింది.
Also Read: Ram Charan: రామ్ చరణ్ ఫ్యాన్స్ గుండెల్లో గునపం దింపిన శంకర్.. ?
మరోవైపు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఊహించని స్థాయిలో సీట్లు, ఓట్లు సాధించిన బీజేపీ తెలంగాణలో తాము కూడా బలంగా ఉన్నామనే సంకేతాలిచ్చింది. అప్పటి వరకు తెలంగాణలో ఏకపక్షంగా సాగిన రాజకీయాలు ఇటు బీజేపీ బలపడడంతో ముక్కోణపు పోటీ ఏర్పడింది. అయితే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పూర్తిగా దెబ్బతిన్న బీఆర్ఎస్ రోజురోజుకు కష్టాల్లో కూరుకుపోతూనే ఉంది. ఒకప్పుడు తెలంగాణలో తాను తప్ప మరో పార్టీకీ చోటు లేదన్న బీఆర్ఎస్ ఇప్పుడు ఆ పార్టీయే చోటు కోసం పోరాడే పరిస్థితి ఏర్పడింది.
బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా అధికార కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్నారు. అసలు పార్టీలో ఎంత మంది మిగులుతారో ఆ పార్టీ అధిష్టానానికి కూడా అంతు పట్టడం లేదు. అతి త్వరలోనే బీఆర్ఎస్ ఎల్పీనీ కాంగ్రెస్ లో విలీనం చేసుకుంటామని కాంగ్రెస్ చెబుతోంది. వీలైనంత ఎక్కువ మందిని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేర్చుకొని ఆ పార్టీనీ పూర్తిగా దెబ్బ తీయాలనే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది.
రాష్ట్రంలో ఓవైపు కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు కనిస్తుంటే.. బీజేపీ మాత్రం చేరికల విషయంలో ఎందుకు మౌనంగా ఉంటోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నయానో భయానో బీఆర్ఎస్‌లో కొందరు ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకోవచ్చు కదా.. మరి ఎందుకు బీజేపీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి ఆసక్తి చూపడం లేదనే చర్చ పొలిటికల్ సర్కిల్ జరుగుతోంది. బీజేపీలోని ఒక వర్గం కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటే బాగుంటుంది కదా అనే ప్రతిపాదన అధిష్టానం పెద్దల ముందు పెట్టినప్పడు అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాలేదట. పైగా చేరికల విషయంలో మీరు ఏమాత్రం స్పందించకండి అంటూ అంతర్గతంగా ఆదేశాలు వచ్చాయట. పార్టీ శ్రేణులకు. అధిష్టానం పెద్దలకు ఎందుకు ఇలాంటి ఆదేశాలు ఇచ్చిందా అని తెలంగాణ బీజేపీ నేతలు ఆరా తీస్తే ఆసక్తికర అంశాలు తెలిసినట్టు సమాచారం. అయితే తెలంగాణ ప్రజలు బీజేపీనీ ఇప్పుడిప్పుడే ఆదరిస్తున్నారని.. అలాంటి సమయంలో అనవసరంగా చెడగొట్టుకోవద్దనేది అధిష్టాం ఆలోచనగా ఉందని తెలియడంతో నేతలు తలలు పట్టుకుంటున్నారట. అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ ల తీరు ఒకేలా ఉన్నాయని తెలంగాణ ప్రజలు వీరి పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని బీజేపీ పెద్దలకు సమాచారం ఉందంట. గతంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అడ్డగోలుగా చేర్చుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పని చేస్తోంది. బీఆర్ఎస్ తీరు నచ్చకే కాంగ్రెస్ కు ప్రజలు అవకాశం ఇచ్చారని ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పనిచేయడంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని పార్టీ పెద్దలు చెబుతున్నారట.
ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..
ముఖ్యంగా చేరికల విషయంలో బీజేపీ ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఇక్కడి శ్రేణులకు ఆదేశించినట్టు తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఇప్పుడే చేర్చుకుంటే బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు అంటుకున్న మురికి మనకు అంటుతుందని అధిష్టానం ఆలోచనగా ఉన్నట్టు సమాచారం. ఒకరో ఇద్దరో పార్టీలో చేరినంత మాత్రాన బీజేపీకీ పెద్దగా ఒరిగేదీమీ లేదు. ఒకవేళ ఎవరైనా చేరితే లాభం కన్నా పార్టీకీ నష్టం జరుగుందనేది బీజేపీ పెద్దల భావనట. అందుకే చేరికల విషయంలో పెద్దగా బీజేపీ ఆసక్తి చూపడం లేదట. గతంలో కర్ణాటకలో ఇలా చేసే చేజేతులారా కాంగ్రెస్ కు అధికారాన్ని అప్పజెప్పామని తెలంగాణలో మాత్రం అది రిపీట్ కాకుండా బీజేపీ జాగ్రత్తపడుతోందట. ఒక వేళ ఎవరైనా ఇతర పార్టీ ఎమ్మెల్యేలు పార్టీలో చేరాలంటే మాత్రం ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే అని ఒక షరతు పెడుతున్నారట. దీంతో బీజేపీ చేరికలపై ఒక క్లారిటీతో ఉందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. రేపటి రోజున చేరికల విషయంలో ఏదైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు రెండు పార్టీను నిలదేసే అవకాశం ఉంటుందన్ని బీజేపీ పెద్దలు చెబుతున్న మాట.
మొత్తంగా చేరికల విషయంలో బీజేపీ పెద్దల మనోగతం తెలిసిన రాష్ట్ర బీజేపీ నేతలు సైలెంట్ గా ఉన్నట్టు తెలుస్తోంది. తప్పని పరిస్థితుల్లో మాట్లాడాల్సి వస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలను విమర్శించడం తప్పా అంతకు మించి మాట్లాడకూడదని పార్టీ నేతలు నిర్ణయించుకున్నట్టు సమాచారం. అయితే కాషాయ పెద్దల మూడ్ తెలుసుకున్న నేతలు కామ్ గా ఉండడమే బెటర్ అని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook