Telangana Budget Session: తొలిరోజే బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్.. సమావేశాలు ముగిసేంతవరకూ వేటు..
తెలంగాణ బడ్జెట్ సమావేశాల తొలి రోజే బీజేపీ శాసన సభ్యులపై వేటు పడింది. బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజాసింగ్‌లను స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి సమావేశాల నుంచి సస్పెండ్ చేశారు.
BJP MLA's suspended from Telangana Assembly: తెలంగాణ బడ్జెట్ సమావేశాల తొలి రోజే బీజేపీ శాసన సభ్యులపై వేటు పడింది. బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజాసింగ్‌లను స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి సమావేశాల నుంచి సస్పెండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేంతవరకూ వీరిపై సస్పెన్షన్ వేటు ఉంటుందని స్పష్టం చేశారు. మంత్రి హరీష్ రావు బడ్జెట్‌పై ప్రసంగిస్తున్న సమయంలో అడ్డు తగిలినందుకు ఈ ముగ్గురిని సస్పెండ్ చేయాల్సిందిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీర్మానం ప్రవేశపెట్టగా.. స్పీకర్ అందుకు ఆమోదం తెలిపారు.
అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్ చేయడంతో ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజాసింగ్ మెడలో నల్ల కండువాలు ధరించి అసెంబ్లీ గేటు ఎదుట నిరసనకు దిగారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని అంటూ నినదించారు. సభ నుంచి తమను సస్పెండ్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హుజురాబాద్ ఉపఎన్నికలో గెలుపు తర్వాత ఈటల రాజేందర్ తొలిసారి అసెంబ్లీలో అడుగుపెడుతుండటంతో.. ప్రభుత్వానికి, ఈటలకు మధ్య రసవత్తర పోరు ఉంటుందని అంతా భావించారు. అయితే ప్రభుత్వం వ్యూహాత్మకంగా అసెంబ్లీ సమావేశాల తొలిరోజే ఆయనపై సస్పెన్షన్ వేటు పడేలా చేసింది. తమ ఎమ్మెల్యేలపై వేటు వేయడాన్ని బీజేపీ శ్రేణులు నిరసిస్తున్నాయి.
ఇక బడ్జెట్ విషయానికొస్తే.. ఆర్థిక మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో బడ్డెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.2.56 లక్షల కోట్లతో కూడిన ఈ బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం రూ.1,89,274 కోట్లు కాగా, కేపిటల్ వ్యయం రూ.29,728 కోట్లు. ఈసారి బడ్జెట్‌లో దళిత బంధు వంటి సంక్షేమ పథకాలకు, వ్యవసాయ రంగానికి భారీగా నిధులు కేటాయించారు.
Also Read: AP Governor Address: అభివృద్ధి దిశగా ఏపీ పయనం, గవర్నర్ ప్రసంగంలో కీలకాంశాలివే
Also Read: Pooja Hegde: మా జంట బాగుందని చెబుతున్నారు.. పెళ్లెప్పుడని ప్రభాస్‌ను నేను కూడా అడిగా: పూజా హెగ్డే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook