Pooja Hegde: మా జంట బాగుందని చెబుతున్నారు.. పెళ్లెప్పుడని ప్రభాస్‌ను నేను కూడా అడిగా: పూజా హెగ్డే

Pooja Hegde Funny Reaction On Prabhas Marriage. ప్రభాస్‌ పెళ్లెందుకు చేసుకోలేదని మీరు కూడా ఎప్పుడూ అడుగుతుంటారు కదా.. రాధేశ్యామ్‌ సినిమాలో మీ అందరి తరపున నేను కూడా అడిగాను అని బుట్టబొమ్మ పూజా హగ్డే చెప్పారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 7, 2022, 11:07 AM IST
  • మార్చి 11న రాధేశ్యామ్‌ విడుదల
  • మా జంట బాగుందని చెబుతున్నారు
  • పెళ్లెప్పుడని ప్రభాస్‌ను నేను కూడా అడిగా
Pooja Hegde: మా జంట బాగుందని చెబుతున్నారు.. పెళ్లెప్పుడని ప్రభాస్‌ను నేను కూడా అడిగా: పూజా హెగ్డే

Pooja Hegde Funny Reaction On Prabhas Marriage: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌, బుట్టబొమ్మ పూజా హగ్డే జంటగా తెరకెక్కిన సినిమా 'రాధేశ్యామ్‌'. ప్రస్తుతం యావత్‌ భారత సినిమా ఇండస్ట్రీ దృష్టిఈ సినిమాపై పడింది. కరోనా కారణంగా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందుకు తగ్గట్టుగానే చిత్ర యూనిట్‌ కూడా సినిమా ప్రమోషన్స్‌ను చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రభాస్‌, పూజా హగ్డేలు బిజీగా ఉన్నారు. 

ప్రభాస్‌, పూజా హెగ్డేలు గత కొన్నిరోజులుగా బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌ వరకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే బుట్టబొమ్మ పలు విషయాలు పంచుకున్నారు. 'రాధే శ్యామ్‌లో ప్రేరణ పాత్ర చేశాను. ఈ పాత్రలో చాలా షేడ్స్‌ ఉన్నాయి. నా కెరీర్‌లో చాలా సవాల్‌తో కూడుకున్న పాత్ర ఇది. నాలుగేళ్ల నుంచి ఆ పాత్రతో కనెక్ట్‌ అయి ఉన్నాను. కెరీర్‌లో మొదటిసారి నా పాత్ర కోసం ఎక్కువ రీసెర్చ్‌ చేశాను. ఇందుకోసం చాలా బుక్స్‌ చదివాను. ప్రేరణ పాత్రకి నా బెస్ట్‌ ఇచ్చాను. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నా' అని పూజా అన్నారు. 

'సినిమా కథ జ్యోతిష్యం నేపథ్యంలో సాగుతుంది. భారతీయ సంస్కృతి చాలా గొప్పది. జ్యోతిష్యంలో ఏదో ఓ పవర్‌ ఉంది. నిజ జీవితంలో నేను జ్యోతిష్యాన్ని నమ్ముతాను. అది కూడా ఒక సైన్స్‌ అని భావిస్తా. నేను చాలా మంది జ్యోతిష్యులను కలిశాను. వాళ్లు నా కెరీర్‌ గురించి కచ్చితమైన ప్రిడిక్షన్స్‌ ఇచ్చారు. నిజానికి టెలిస్కోప్‌ తయారు చేయడానికి ఎన్నో ఏళ్ల ముందే మనవాళ్లు గొప్ప ఆస్ట్రాలజీ బుక్స్‌ రాశారు. రాధాకృష్ణ కుమార్ చాలా కష్టపడ్డారు. అద్భుతంగా తెరకెక్కించారు. సినిమా అందరికి నచ్చుతుంది. చాలా చాల ఎంజాయ్ చేస్తారు' అని బుట్టబొమ్మ ధీమా వ్యక్తం చేశారు. 

'ప్రభాస్‌తో కలిసి పనిచేయడం చాలా సరదాగా అనిపించింది. ఆయనకు కాస్త సిగ్గెక్కువ. అయితే ఒక్కసారి కలిసిపోతే సరదాగా ఉంటారు. ఇటలీలో చిత్రీకరణ జరుగుతున్న సమయంలో టీమ్‌ సభ్యుల్లో ముగ్గురికి కరోనా వచ్చింది. అప్పుడు ప్రభాస్‌ స్వయంగా వెజిటేరియన్‌ ఫుడ్‌ తయారు చేయించి పంపారు. అందం, మంచితనం ఉన్న ప్రభాస్‌ పెళ్లెందుకు చేసుకోలేదని మీరు కూడా ఎప్పుడూ అడుగుతుంటారు కదా. అందుకే రాధేశ్యామ్‌ సినిమాలో మీ అందరి తరపున నేను ప్రభాస్‌ను అడిగాను. దానికి ఆన్సర్‌ ఏంటి? అన్నది తెలియాలంటే రాధే శ్యామ్‌ చూడాలి. ప్రభాస్‌, నా హైట్ మ్యాచ్ అవ్వడంతో మా జంట బాగుందని అందరూ అంటున్నారు. చాలా సంతోషంగా ఉంది' అని పూజా చెప్పారు. 

'నా కిప్పుడు ప్రేమించే తీరికలేదు. చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. నా దృష్టంతా వాటిని పూర్తి చేయడం పైనే ఉంది. ఇంత బిజీలో ప్రేమకు ఎక్కడ చోటుంటుంది. 'ఆచార్య', 'బీస్ట్‌' వంటి పెద్ద చిత్రాలు రానున్నాయి. త్వరలో మహేష్‌ బాబుతో ఓ చిత్రం చేయనున్నా. పవన్‌ కల్యాణ్‌కు జోడీగా 'భవదీయుడు భగత్‌సింగ్‌'లో నటించనున్నా. నటిగా నన్ను నిలబెట్టింది, గౌరవాన్ని ఇచ్చింది తెలుగు చిత్ర పరిశ్రమే. నాకింత గొప్ప కెరీర్‌ ఇచ్చిన ఇండస్ట్రీని నేనెప్పటికీ మరచిపోను. నా తొలి ప్రాధాన్యం ఎప్పుడు తెలుగు పరిశ్రమకే' అని పూజా హగ్డే చెప్పుకొచ్చారు. 

Also Read: Telangana Budget 2022: భారీగా పెరగనున్న పింఛన్లు.. రైతు రుణ మాఫీకి పెద్దఎత్తున నిధులు!!

Also Read: Telangana Budget 2022: నేడు తెలంగాణ బ‌డ్జెట్.. ఎమ్మెల్యే ఈటెల అసెంబ్లీ రాకపై పోలీసుల ఆంక్షలు!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News