Bandi Sanjay on The Kerala Story Movie: కాచిగూడలోని తారకరామ థియేటర్‌లో ది కేరళ స్టోరీ మూవీని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం వీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేరళ సినిమా చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. పేరు ప్రఖ్యాతలు, వ్యాపారం కోసం సినిమా తీయలేదన్నారు. ఈ సినిమా సమాజానికి కొన్ని జాగ్రత్తలు చెప్పిందని.. కేరళతో పాటు దేశవ్యాప్తంగా ఐసిస్ లాంటి ఉగ్రవాద సంస్థలు అమ్మాయిలకు మాయమాటలు చెప్పి లోబరుచుకుంటాయని అన్నారు. కేరళకు మాత్రమే ఇది పరిమితం కాదని అభిప్రాయపడ్డారు. లవ్ జిహాద్ పేరుతో తెలంగాణలో కూడా దారుణాలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ఏ ధర్మ రక్షకుడికి అమ్మాయి పరువు తీయాలని ఉండదు. సినిమాలో చూపించింది 5 నుంచి 10 శాతమే. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. దేశాన్ని అస్థిర పర్చాలని చూస్తున్నారు. మీ పిల్లలకు సినిమా చూపించండి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఉగ్రవాద సంస్థల ప్రతినిధులకు స్థావరాలు ఇస్తున్నారు. క్రిస్టియన్ అమ్మాయిలకు కూడా మోసం చేస్తున్నారు. సమాజం జాగృతం కావాల్సిన అవసరం ఉంది. సీఎం కేసీఆర్ కూడా కేరళ సినిమా చూడాలి. ఓల్డ్ సిటీలో సౌదీ నుంచి వచ్చి పెళ్లి చేసుకొని వెళ్తున్నారు. ముస్లిం మహిళలకు కేంద్ర ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది. 


రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్నులన్ని మినహాయించాలని కోరుతున్నా. కేరళ లాంటి సినిమాలు వారానికి ఒకటి తీస్తాం.. సినిమా చూపిస్తాం.. డైరెక్టర్‌కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. కరీంనగర్‌లో జరిగే హిందూ ఏక్తా యాత్రకు కేరళ సినిమా డైరెక్టర్ రాబోతున్నారు..' అని బండి సంజయ్ తెలిపారు. కేరళ స్టోరీ సినిమా డైరెక్టర్, నిర్మాతకు హ్యాట్సాప్ చెప్తున్నానని అన్నారు. 


అనంతరం బీజేపీ సీనియర్ నాయకుడు డా.లక్ష్మణ్ మాట్లాడుతూ.. కేరళ సినిమా రాజకీయ పార్టీలకు కనువిప్పు కావాలని అన్నారు. యధార్థ గాథను సినిమాలో చూపించారని చెప్పారు. ఉగ్రవాద సంస్థల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాజకీయ, న్యాయ సహాయం అందిస్తున్నారో వారికి బుద్ది చెప్పాలని కోరారు. వినోదం కోసం తీసిన సినిమా కాదన్నారు. కేరళ సినిమాలో జరిగిన ఘటనలకు కూడా సీఎం కేసీఆర్‌కి ఆధారాలు కావాలా..? అని ప్రశ్నించారు. వినోదపు పన్నును తెలంగాణ ప్రభుత్వం మినహాయించాలని కోరారు. రజాకార్ ఫైల్స్ సినిమా రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.


Also Read: KKR Vs PBKS Deam11 Prediction 2023: కేకేఆర్ ఓడితే ఇంటికే.. నేడు పంజాబ్‌తో ఢీ.. డ్రీమ్ 11 టీమ్ టిప్స్ మీ కోసం..  


Also Read: Mutual Fund Calculator: రోజుకు రూ.500 ఇన్వెస్ట్ చేయండి.. కోటీశ్వరులు అవ్వండి ఇలా.. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి