Bandi Sanjay Comments: తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య వార్ కొనసాగుతోంది. ఇరుపార్టీల నేతలు పరస్పరం విమర్శించుకుంటున్నారు. మోదీ 8 ఏళ్ల పాలనపై అధికార పార్టీ పెదవి విరుస్తోంది. ఇటు తెలంగాణ ప్రభుత్వ అవినీతిపై బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇలా  ఇరుపార్టీల నేతల మాటలతో రాష్ట్రంలో రాజకీయాలు హీటెక్కాయి. తాజాగా సీఎం కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉచిత విద్యుత్ పేరుతో సీఎం కేసీఆర్ మహా దోపిడీ పాల్పడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఫామ్‌హౌజ్‌ కోసం ప్రత్యేక సబ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేశారన్నారు. 40 గ్రామాలకు అవసరమైన కరెంట్‌ను ఉచితంగా వాడుకుంటున్న ఘనుడు కేసీఆర్ అంటూ ఫైర్ అయ్యారు. పనికిరాని భద్రాద్రి పవర్ ప్లాంట్‌కు వేల కోట్ల ఖర్చు ఎందుకని ప్రశ్నించారు. కమీషన్ల కోసం మార్కెట్ రేటు కంటే రెట్టింపు ధర చెల్లించి కరెంట్ కొనుగోలు చేస్తూ ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని మండిపడ్డారు.


విచ్చలవిడి దోపిడీ తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తి దివాళా తీయించారని విమర్శించారు. బొగ్గు దిగుమతి విషయంలో సీఎం, అధికారులు చెబుతున్నవన్నీ అసత్యలేనన్నారు. సింగరేణి కార్మికులు దాచుకున్న సొమ్మును కూడా డ్రా చేసి జీతాలు చెల్లిస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ మూసివేత వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు.


సింగరేణిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి టీఆర్ఎస్‌ నేతలు వేల కోట్లు దండుకున్నారని తెలిపారు. ఇవన్నీ తెలిసినా సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. హిందువులు, హిందూ ధర్మంపై దాడి జరుగుతుంటే మౌనం దేనికన్నారు. ఇప్పటికైనా ఉచిత విద్యుత్ చిట్టా విప్పలాని డిమాండ్ చేశారు. దీనిపై బహిరంగ చర్చుకు సిద్ధమని సవాల్‌ విసిరారు.


Also read: YSRCP MLC WARNING: అచ్చెన్నాయుడిని గుడ్డలూడదీసి కొడతా.. వైసీపీ ఎమ్మెల్సీ ఓపెన్ వార్నింగ్ 


Also read: Name Astrology: ఈ 4 అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తులు రాజులా జీవితాన్ని గడుపుతారు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


 


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook