Basara IIIT: నిర్మల్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. ఏడవరోజు విద్యార్థులు క్లాసులకు వెళ్లకుండా క్యాంపల్ మొయిన్ గేట్ దగ్గర భైఠాయించారు. సమస్యల పరిష్కారంపై సీఎంవో నుంచి లిఖిత పూర్వక హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు. దీంతో బాసరలో తొలిరోజు ఉన్న పరిస్థితే ఏడవ రోజు కూడా కొనసాగుతోంది. విద్యార్థుల ఆందోళన కొనసాగుతుండటంతో క్యాంపస్ దగ్గర పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల ఆందోళనపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఏడు రోజులుగా విద్యార్థులు రోడ్డుపైనా ఉన్నా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల న్యాయమైన 12 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలపై పరిష్కరించకుండా.. జాతీయపార్టీ ఏర్పాటు సన్నాహాల్లో ఉండటం సిగ్గుచేటన్నారు. విద్యార్థి సంఘాలతో వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రులు, అధికారులు డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. స్టూడెంట్స్ తో మైండ్‌ గేమ్‌ ఆడటం మానుకోవాలని
సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో బండి సంజయ్‌ సూచించారు.


ఇక ఆదివారం అర్ధరాత్రి విద్యార్థులతో ట్రిపుల్ ఐటీ డైరెక్టర్‌ సతీశ్ కుమార్, నిర్మల్ జిల్లా కలెక్టర్‌ ముష్రాఫ్‌ అలీ చర్చలు జరిపారు. రెండు గంటల పాటు చర్చలు జరిపినా ఫలించలేదు. మంత్రులు కేటీఆర్‌, సబిత లిఖిత పూర్వక హామీ ఇప్పించాలని విద్యార్థులు పట్టుబట్టడంతో అధికారులు ఏమి చేసేది లేక వెనుదిరిగారు. దీక్ష విరమించాలని విద్యార్థులను కలెక్టర్ కోరగా.. తమ 12 డిమాండ్లు నేరవేర్చాలని విద్యార్థులు పట్టుబట్టారు. సీఎం నుంచి హామీపత్రం కావాలని తేల్చి చెప్పారు. ఆందోళన విరమించి క్లాసులకు హాజరు కావాలని కలెక్టర్ సూచిచంగా.. హాజరయ్యేది లేదని స్పష్టంచేశారు. క్లాసులకు హాజరైతే తప్పకుండా హామీ ఇప్పిస్తానని అలీ చెప్పగా.. హామీ ఇస్తేనే వస్తామని విద్యార్థులు చెప్పడంతో అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు.


Read also: TS Inter Results 2022 : ఆ రోజే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. tsbie.cgg.gov.inలో వివరాలు..


Read also: Etela Rajender: కోమటిరెడ్డి కారులో ఈటల రాజేందర్.. ఢిల్లీలో ఏం జరిగింది? 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook