Kishan Reddy Reacts on BRS Manifesto: సీఎం కేసీఆర్‌ ప్రకటించిన బీఆర్ఎస్ మేనిఫెస్టోపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.​ ప్రజలను మరోసారి మభ్యపెట్టేందుకు ఎన్నికల ప్రణాళిక బయటపెట్టారని విమర్శించారు. 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన అనేక ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీ అమలు చేయలేదని.. ఏరు దాటే వరకు ఓడ మల్లన్న.. ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్లు ఉంటుంది కేసీఆర్​ తీరు అని ఎద్దేవా చేశారు. దళిత సీఎం, దళితులకు మూడెకరాల స్థలం, నిరుద్యోగ భృతి, నిజాం షుగర్​ ఫ్యాక్టరీ ఓపెనింగ్​, మహిళా సంఘాలకు పావలా వడ్డీ, రైతు రుణ మాఫీ, ఉచిత ఎరువులు.. ఇలా వందల హామీలు ఇచ్చి ప్రజలకు వెన్ను పోటు పొడిచిన నయవంచకుడు కేసీఆర్ అని మండిపడ్డారు​.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"ఆయన చెప్పే మాటలకు.. చేసే చేతలకు.. వళ్లించే చిలుకపలుకులకు పొంతన లేదు. ఎన్నికల హామీలు.. నీటి మూటలే తప్ప.. ఎందులోనూ చిత్త లేదు. అప్పులు పెంచారు, అవినీతి పెంచారు, అహంకారం పెంచుకున్నారు తప్ప.. రాష్ట్ర సంపద పెంచలేదు. బెస్ట్​ ఎకనమికల్​ పాలసీ అని కేసీఆర్​ అంటున్నాడు.. అది బెస్ట్​ కాదు.. వరెస్ట్​ ఎకనామికల్​ పాలసీ. పవర్​ పాలసీ బెస్ట్​ పాలసీ అని అన్నడు.. అది బెస్ట్​ కాదు.. డేంజర్​ పవర్​ పాలసీ. రూ.45 వేల కోట్ల అప్పులతో డిస్కంలు, విద్యుత్​ వ్యవస్థ కుప్పుకూలిపోయే స్థితిలో ఉంది. బెస్ట్​ డ్రింకింగ్​ వాటర్​ పాలసీ అట.. అది బెస్ట్​ డ్రింకింగ్​ వాటర్​ పాలసీ కాదు.. బెస్ట్​ లిక్కర్​ డ్రింకింగ్​ వాటర్​ పాలసీ.


బెస్ట్​ ఇరిగేషన్​ పాలసీ.. అన్నడు.. అది బెస్ట్​ కమిషన్​ ఇరిగేషన్​ పాలసీ. అత్యుత్తమ దళిత పాలసీ అని కేసీఆర్​ అంటున్నాడు.. కానీ కేసీఆర్​ బెస్ట్​ కరప్షన్​ ఫ్యామిలీ పాలసీ, చీటింగ్​ పాలసీ అమలుచేస్తున్నాడు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా.. కొత్తవి ఇస్తున్నారు. కేసీఆర్​ సకల జనుల ద్రోహి.. ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజల చెవుల్లో గులాబీ పువ్వులు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో కేంద్రంలో, రాష్ట్రంలో  కాంగ్రెస్​ పాలన చూశాం. కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ రెండు పార్టీలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. 2014, 2018, అసెంబ్లీ ఎన్నికలు, 2019 పార్లమెంట్​ ఎన్నికల్లో ఏ హామీలు ఇచ్చారో కేసీఆర్​ బయట పెట్టి మాట్లాడాలి. 24 జిల్లా కేంద్రాల్లో నిమ్స్​ స్థాయిలో 24 హాస్పిటల్స్​ కడుతామని హామీ ఇచ్చి ఒక్కటి కూడా కట్టలేదు.


3 ఎకరాల సాగు భూమి, దళితులకు 50 వేల కోట్ల ప్రత్యేక నిధులు, సబ్​ ప్లాన్​ నిధులు దారిమళ్లించకుండా చూడటం, మహిళా బ్యాంకులు, జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, జర్నలిస్టులకు హెల్త్​ కార్డులకు... జర్నలిస్టుల సంక్షేమ నిధి, జర్నలిస్టుల భవనం.. లాంటి ఎన్నో హామీలు ఇచ్చి ఒక్కటీ అమలు చేయలేదు. ప్రవాస భారతీయ విధానం తెస్తామన్నారు.. 10 ఏండ్లు అయినా కాలేదు. మూతపడ్డ కంపెనీలు ఓపెన్​ చేస్తామని ఒక్కటీ ఓపెన్​ చేయలేదు. హైదరాబాద్​ నుంచి వరంగల్‌​కు ఇండస్ట్రియల్​ కారిడార్​ అన్నరు.. అది ఎక్కడ పోయింది..?" అంటూ కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు.


తెలంగాణ ప్రజలను ఒకటే కోరుతున్నానని.. కేసీఆర్​ చెప్పేవి.. కళ్లిబొల్లి మాటలు.. వీరు చెప్పేవి అన్ని అబద్ధాలని అన్నారు. కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ పార్టీలది ప్రజలను మోసం చేసే చరిత్ర అని.. వీటిని ప్రజలు గమనించాలని కోరారు. ప్రభుత్వ చేతగానితనంతో, పరీక్షలు నిర్వహించే సామర్థ్యం లేక.. నోటిఫికేషన్లు వాయిదా పడుతుంటే.. దిక్కుతోచని స్థితిలో నిరుద్యోగులు ​ఆందోళనలో ఉన్నారని అన్నారు. 3016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్న కేసీఆర్​.. ఒక్కరికి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. కేసీఆర్​ మాటలను ఇప్పుడు చదువుకున్నవారే కాదు.. చదువు రాని వారు కూడా నమ్మే పరిస్థితి లేదన్నారు.


Also read: Best Mileage Cars Under Rs 6 Lakhs: జస్ట్ 6 లక్షలకే వచ్చే బెస్ట్ మైలేజ్ కార్లు


Also Read: Motorola Edge 40 Neo Price: పిచ్చెకించే ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Motorola Edge 40 Neo మొబైల్..డెడ్‌ చీప్‌ ధరకే మీ కోసం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook