Telangana BJP: తెలంగాణలో కమలనాథులు జోరు పెంచారు. వరుస కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. పార్టీ పెద్దలను తీసుకొస్తూ.. శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఇప్పటికే కేంద్రమంత్రి అమిత్ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పలు దఫాలుగా రాష్ట్రంలో పర్యటించారు. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే ఏం చేస్తామో ప్రకటించి వెళ్లారు. మరో నాలుగు రోజుల్లో ప్రధాని మోదీ సైతం రాష్ట్రానికి వస్తున్నారు. ప్రధాని టూర్‌ను సక్సెస్ చేసేందుకు ఆ పార్టీ నేతలు ప్రణాళికలు వేస్తున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో భారీ రోడ్ షో నిర్వహించాలని యోచిస్తున్నారు. ఆ దిశగా పావులు కదుపుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ మలివిడత ప్రజా సంగ్రామ యాత్రకు శ్రీకారం చుట్టే అవకాశం కనిపిస్తోంది. ఇందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే నెల 23 నుంచి మూడో విడత పాదయాత్ర చేపట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు బండి సంజయ్ సమాయత్తమవుతున్నారు. జూన్ 23న శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ సందర్భంగా పాదయాత్ర చేపడితే మంచిదన్న భావనలో బీజేపీ నేతలు సైతం ఉన్నారు.  ఖమ్మ లేదా వరంగల్ జిల్లాలో పాదయాత్రను చేపట్టే అవకాశం ఉంది. మొత్తం 20 రోజులపాటు పాదయాత్ర ఉండే లా ప్లాన్‌లు వేస్తున్నారు. 


ఇప్పటికే చేపట్టిన రెండు విడతల పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. మొదటి విడత పాదయాత్రను హైదరాబాద్‌ నడిబొడ్డు నుంచి ప్రారంభించారు. అడుగడునా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. రెండో దఫా యాత్రను అలంపూర్ జోగులాంబ గుడి శ్రీకారం చుట్టారు. ఇటీవల తుక్కుగూడలో ప్రజాసంగ్రామ యాత్ర ముగించింది. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు కేంద్రమంత్రి అమిత్ షా వచ్చారు. పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపి వెళ్లారు. అదే ఉత్సాహంతో మూడో విడత పాదయాత్ర చేపట్టేందుకు బండి సంజయ్ సిద్ధమవుతున్నారు. 


మూడో విడత పాదయాత్ర ప్రారంభానికి జాతీయ పార్టీ నేతలను పిలవాలని రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఆహ్వానించాలని బండి సంజయ్‌ సైతం యోచిస్తున్నారు. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఆ దిశగా పావులు కదుపుతోంది. ప్రధాని మోదీ రాకతో తెలంగాణ కమలంలో మరింత ఉత్సాహం రానుంది. మరి వచ్చే ఎన్నికల్లో బీజేపీని ప్రజలు ఏమేరకు ఆదరిస్తారో చూడాలి.


Also read:Air Force Jobs 2022: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు, నోటిఫికేషన్ విడుదల


Also read:RCB IPL 2022 Playoffs: ముంబైతో ఢిల్లీ మ్యాచ్.. బెంగళూరు ఆటగాళ్ల ఎమోషన్స్ ఎలా ఉన్నాయో చూడండి (వీడియో)!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook