Bandi Sanjay: పెరిగిపోతున్న చమురు ధరలతో అల్లాడిపోతున్న వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శనివారం గుడ్ న్యూస్ చెప్పింది. పెట్రోల్, డీజిల్ పై సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించింది. లీటర్ పెట్రోల్ పై రూ. 8, లీటర్ డీజిల్ పై రూ. 6 సుంకం తగ్గించింది. మోడీ సర్కార్ నిర్ణయంతో లీటర్ పెట్రోల్ ధర 9 రూపాయల 50 పైసలు.. డీజిల్ ధర 7 రూపాయల మేర తగ్గింది. తగ్గిన ధరలు అర్ధరాత్రి నుంచే అమలులోనికి వచ్చాయి. ఎల్పీజీ సిలిండర్ ధరను కూడా 200 రూపాయలు తగ్గించింది బీజేపీ సర్కార్. పీఎం ఉజ్వల యోజన పథకం కింద లబ్దిదారులుగా ఉన్న 9 కోట్ల మంది వినియోగదారులకు.. రూ. 200 సబ్సీడీతో ఏడాదికి 12 సిలిండర్లు ఇవ్వనుంది.కేంద్ర సర్కార్ ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో.. కొన్ని రాష్ట్రాలు కూడా అదే బాట పట్టాయి. కేరళ, రాజస్థాన్ రాష్ట్రాలు తమ పరిధిలోని ట్యాక్స్ ను తగ్గించాయి. మిగితా రాష్ట్రాలు కూడా పెట్రోల్, డిజిల్ పై పన్ను తగ్గించాలనే డిమాండ్ వస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ పై పన్ను అధికంగా ఉంది. దేశంలో ప్రస్తుతం లీటర్ డీజిల్ రేటు హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉంది. దీంతో కేంద్ర తరహాలోనే కేసీఆర్ సర్కార్.. చమురుపై రాష్ట్ర పరిధిలోని పన్ను తగ్గించాలనే డిమాండ్ వస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఇదే డిమాండ్ చేశారు. కరీంనగర్ లో మాట్లాడిన సంజయ్.. కేసీఆర్ సర్కార్ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. రష్యా- ఉక్రెయిన్ వార్ ప్రభావం ఉన్నా.. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించిందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం కూడా చమురుపై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేశారు.
లీటర్ పెట్రోల్‌పై టీఆర్ఎస్ సర్కార్ 30 రూపాయలు పన్ను వేస్తుందని బండి సంజయ్ అన్నారు. రాష్ట్రం వ్యాట్ తగ్గిస్తే లీటర్ పెట్రోల్ 80 రూపాయలకే ఇవ్వొచ్చన్నారు. ప్రజలకు భారమవుతున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదని బండి సంజయ్. విమర్శించారు. అక్రమంగా సంపాదించిన డబ్బులను దాచుకునేందుకే కేటీఆర్ విదేశాలకు వెళ్లారని ఆరోపించారు. సీఎంగా పాలనలో పూర్తిగా విఫలమైన కేసీఆర్.. ఢిల్లీకి వెళ్లి ఏం చేస్తారని సంజయ్ విమర్శించారు. వృద్దాప్య పెన్షన్లు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని కేసీఆర్.. ఇతర రాష్ట్రాలకు సాయం చేయడం చూసి ఢిల్లీలో నవ్వుకుంటున్నారని సెటైర్లు వేశారు. రాష్ట్రంలో చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శించని కేసీఆర్.. ఇతర రాష్ట్రాల్లోని రైతు కుటుంబాలకు పరామర్శిచడం విడ్డూరంగా ఉందని బండి సంజయ్ మండిపడ్డారు.
READ ALSO: Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ కార్ల్‌సన్‌కు మరోసారి ప్రజ్ఞానంద షాక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook