Telangana Board Of Education Intermediate Exams 2021 | కరోనావైరస్ సంక్రమణ వేగంగా పెరుగుతున్న సమయంలో తెలంగాణ ఎడ్యుకేషన్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. 2021లో జరగబోయే టెన్త్, ఇంటర్ పరీక్షలపై తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఇంటర్ పరీక్షలను ( Intermediate Exams 2021) ఏప్రిల్ చివరిలో, టెన్త్ పరీక్షలను 2021 మేలో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ పరీక్షలతో పాటు మిగతా ప్రవేశ పరీక్షలను కూడా మే నెలలో నిర్వహించాలని బోర్డు భావిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


lso Read | False Website Alert: ఈ నకిలీ గ్యాస్ ఏజెన్సీ వెబ్‌సైట్ తో జాగ్రత్త!


ఈ మేరకు తెలంగాణ ( Telangana ) విద్యాశాఖ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ చిత్రా రామచంద్రన్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఒక వేళటెన్త్ పరీక్షలు ఏప్రిల్ చివరిలో ప్రారంభం అయితే అవి మే10వ తేదీలోపు ముగిసే అవకాశం ఉంది. తరువాత ఇంటర్ పరీక్షలు మొదలయ్యే అవకాశం ఉంది. గతంలో ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ ప్రకారం మార్చి 24న ఎగ్జామ్స్ ప్రారంభం అవ్వాలి. అయితే వీటిని మేలో నిర్వహించే విధంగా అవకాశం ఉందో లేదో పరిశీలించమని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అని చిత్ర రామచంద్రన్ . 



Also Read | Raghunandan Rao: బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే


2020 డిసెంబర్ 1వ తేదీ నుంచి స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం అయితే సిలబస్ పూర్తి అవ్వడానికి సుమారు 5 నెలల సమయం పడుతుంది. దాంతో ప్రభుత్వం పరీక్షలను మే21వ తేదీ వరకు పొడగించే అవకాశం ఉంది. 



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR