Valentines Week:వాలెంటైన్ వీక్ లో దారుణం.. నడిరోడ్డుమీద ప్రియురాలిని చంపిన ప్రేమోన్మాది.. ఎక్కడంటే..?
Nirmal: నడిరోడ్డు మీద యువకుడు రెచ్చిపోయాడు. తనతో పాటు తెచ్చుకున్న మారణాయుధంతో యువతిపై దాడిచేశాడు. అంతే కాకుండా ఆమెను పలుమార్లు ఇష్టమోచ్చినట్లు పొడిచాడు. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా భయాందోళనలకు గురయ్యారు.
Boy Brutally Attack On Her Lover: ప్రేమికులంతా వాలెంటైన్ వేడుకలను జరుపుకుంటున్నారు. తమకు ఇష్టమైన వారి కోసం రోజుకో విధంగా తమకున్న ప్రేమను చూపిస్తున్నారు. ఈ వారమంతా వాలెంటైన్ వీక్ గా జరుపుకుంటారు. నిన్నటి నుంచి వాలెంటైన్ వీక్ ప్రారంభమైంది. వారంలో ఏడు రోజులకు కూడా రోజుకో విధంగా తమ ప్రేమను ఇష్టమైనవారిపట్ల చూపిస్తుంటారు. ఇదిలా ఉండగా.. వాలెంటైన్ వీక్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది.
ఎంతో ప్రేమగా చూసుకొవాల్సిన ప్రియురాలిపట్లు యువకుడు, ఉన్మాదిగా మారాడు. మారణాయుధాలతో ఇష్టమోచ్చినట్లు పొడిచాడు. దీంతో ఆమె రోడ్డుపైన తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలింది. ఈ షాకింగ్ ఘటనతో చుట్టుపక్కలున్న వారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన ప్రేమికులు ఎంతో వేడుకగా భావించే.. వాలెంటైన్ లో చోటు చేసుకొవడంతో యువత అంతా షాకింగ్ కు గురవుతున్నారు.
పూర్తి వివరాలు..
తెలంగాణాలో నిర్మల్ లో గురువారం దారుణ ఘటన జరిగింది. ఖానాపూర్ శివాజీనగర్ లో నడిరోడ్డు మీద యువకుడు ఉన్మాదిగా మారాడు. తనతో ప్రేమకు, పెళ్లికి నిరాకరించిందని యువతిపై కోపం పెంచుకున్నాడు. అప్పటికే యువతి అలేఖ్య కోసం రెక్కి నిర్వహించాడు. యువతి టైలరింగ్ చేసుకుని, ఇంటికి వెళ్తుండగా.. ఒక్కసారిగా దారికాచి ఆమెపై దాడిచేశాడు. దీంతో ఒక్కసారిగా భయాందోళనలకు గురైన యువతి.. కుప్పకూలిపోయింది.
ఆమెపై పదునైన ఆయుధాలతో దాడిచేశాడు. పలుమార్లు ఇష్టమోచ్చినట్లు పొడిచి గాయపర్చాడు. కొందరు రోడ్డుపైన ఆపేందుకు ప్రయత్నించగా వారిపైన కూడా దాడిచేశాడు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా అరుపులు, కేకలు,రక్తపు మడుగులతో భయానకంగా మారిపోయింది. యువతి రక్తపు మడుగులో కిందపడిపోయింది. వెంటనే యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. వాలెంటైన్ వీక్ లో రెండో రోజు ఇలా షాకింగ్ ఘటన జరగటంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook