BRS KTR: నీ పక్కనే ఉన్నాయి మానవ బాంబులు... సీఎం రేవంత్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన కేటీఆర్..
Brs Party Meeting:కాంగ్రెస్ పార్టీలోనే మానవ బాంబులున్నాయని మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ను సొంత పార్టీ నేతలే ముంచేస్తారని వ్యాఖ్యలు చేశారు. మీరు ఇచ్చిన హమీలు నెరవేర్చేవరకు వెంటాడతామని హెచ్చరించారు.
BRS KTR Comments On CM Revanth Reddy In karimanagar: సీఎం రేవంత్ రెడ్డి దిగజారీ మాట్లాడుతున్నారని, పాలమూరు సభలో ఆయన గొంతుకోస్తా, మానవ బాంబై పేలుతా అన్నవ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత, మాజీ ఐటీ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ లో కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఇచ్చిన 420 హమీలు నెరవేర్చేవరకు ఆయనను వదిలే ప్రసక్తి లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే మానవ బాంబులున్నారని .. కొందరు ఖమ్మం నుంచి ఉంటే, మరికొందరు నల్లగొండ నుంచి మానవ బాంబులున్నారంటూ ఎద్దేవా చేశారు.
Read More: Niharika Konidela: చీరకట్టులో కనికట్టు చేస్తోన్న నిహారిక కొణిదెల.. మెగా డాటర్ లేటస్ట్ పిక్స్ వైరల్..
అంతే కాకుండా .. ప్రజలకు గుర్రం ఎవరో .. గాడిద ఎవరో తెలిసి రావాలని కేటీఆర్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హమీలు నెరవేర్చే వరకు ఆయనను వదిలే ప్రసక్తి లేదని ఆయన అన్నారు. ఆంధ్ర పాలకులు, కరుడు గట్టిన కాంగ్రెస్ నేతలతో పోరాటీ తెలంగాణను సాధించుకున్నామని గుర్తుచేశారు. సీఎం రేవంత్ రెడ్డి దిగజారీ మాట్లాడుతున్నాడని, అధికారంలో ఉన్న కూడా ఫ్రస్టేషన్ లో మాట్లాడుతున్నరని పేర్కొన్నారు.
రేవంత్ ను ఖమ్మం, నల్గొండ బాంబులే ఏమైన చేయోచ్చన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఐదేళ్లపాటు పాలన కోనసాగించాలని తాము కోరుకుంటున్నామని మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. అప్పుడు కదా.. ప్రజలకు ఎవరు ఎలా పాలించారో అర్థమౌతుందన్నారు.
Read More: ToothBrush: మీ టూత్ బ్రష్ బాత్రూమ్ లో పెడుతున్నారా..?.. ఎంత పెద్ద ప్రమాదమో తెలుసా..?
కేసీఆర్ ను కావాలని బద్నామ్ చేయాలని ప్రతిదానిపై కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని కేటీఆర్ ఎద్దెవా చేశారు. పదేళ్లు ప్రధాని మోదీగా ఉన్నారు. బండి సంజయ్ ఎంపీగా ఉండి కూడా కరీంనగర్ కు ఏంచేశారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. వచ్చే ఎంపీ ఎన్నికలలో బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook