Niharika Konidela: చీరకట్టులో కనికట్టు చేస్తోన్న నిహారిక కొణిదెల.. మెగా డాటర్ లేటస్ట్ పిక్స్ వైరల్..

Niharika Konidela: నిహారిక కొణిదెల విషయానికొస్తే.. మెగా డాటర్‌గా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ భామ.. తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఒక వైపు హీరోయిన్‌గా నటిస్తూనే .. నిర్మాతగా రాణిస్తోంది. గతేడాది విడాకుల వ్యవహారంతో మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచింది.

1 /6

నిహారిక కొణిదెల గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. దాదాపు అర డజను పైగా హీరోలున్న మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా అడుగు పెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

2 /6

ఆ మధ్య చైతన్య జొన్నలగడ్డను పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకొంది. ఆ తర్వాత అతనికి విడాకుల ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచింది.

3 /6

నిహారిక కేవలం యాక్ట్రెస్‌గానే కాకుండా నిర్మాతగా రాణిస్తోంది. పింక్ ఎలిఫెంట్ బ్యానర్ పై పలు వెబ్ సిరీస్‌లను నిర్మిస్తూ ఫుల్ బిజీగా ఉంది.

4 /6

అంతేకాదు సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లో నటించింది. ఎప్పటికపుడు తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.

5 /6

నిహారిక కొణిదెలకు సోషల్ మీడియాలో 2.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. తెలుగులో ఈమె 'ఒక మనసు', హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం సినిమాల్లో కథానాయిక పాత్రలో నటించింది.

6 /6

అటు తమిళంలో ఒకటి రెండు చిత్రాల్లో నటించింది. ఇక తెలుగులో పెదనాన్న చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' సినిమాలో కీలక పాత్రలో నటించింది.