Farm House Operation:  మునుగోడు ఉప ఎన్నిక ముగిసే వరకు ఎమ్మెల్యేల బేరసారాలపై దర్యాప్తు ఆపాలని హైకోర్టు ఆదేశించినా ఈ ఘటనపై రాజకీయ రచ్చ ఆగడం లేదు. టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది.ఆదివారం చండూరులో నిర్వహించిన బహిరంగ సభకు తనతో పాటు ఫాంహౌజ్ డీల్ లో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలను తీసుకెళ్లారు సీఎం కేసీఆర్. సభా వేదికపై ఆ నలుగురు ఎమ్మెల్యేలను జనాలకు పరిచయం చేస్తూ.. తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టి పులి బడ్డలని కొనియాడారు. వందల కోట్ల రూపాయల ఆఫర్ ను చెప్పుతో కొట్టి వదిలేసి వచ్చారంటూ జనాల చేత చప్పట్లు కొట్టించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫాంహౌజ్ డీల్, నలుగురు ఎమ్మెల్యేల విషయంలో సెటైరిక్ గా స్పందించారు తెలంగాణ బీఎస్చీ చీఫ్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. బ్రోకర్లకు అమ్ముడుపోకుండా పౌరుషం చాటిన నికార్సయిన ఎమ్మెల్యేలను ప్రగతి భవన్ అనే బోను నుండి ఎప్పుడు విడుదల చేస్తారు కేసీఆర్ జీ అని ఆయన ట్వీట్ చేశారు. దృశ్యం 3 సినిమా చూపించడం ఇంకా పూర్తయినట్లు లేదు అంటూ ఎద్దేవా చేశారు.  చండూరు బహిరంగ సభలో  నలుగురు ఎమ్మెల్యేల చేత కేసీఆర్ ఎందుకు మాట్లాడించలేదని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.


'' 'పాపం' బ్రోకర్లకు అమ్ముడు పోకుండా నిలబడ్డ నికార్సయిన నలుగురు పులిబిడ్డలైన మీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎప్పుడు ప్రగతి భవన్ అనే బోను నుండి వదుల్తవు కేసీఆర్ జీ? వాళ్లు పులి బిడ్డలైతే నిన్న చండూరులో వాళ్లతో ఎందుకు మాట్లాడించలేదు? మీరు పులి బిడ్డలకు దృశ్యం-3 సినిమా చూపించడం ఇంకా పూర్తయినట్లు లేదు'' అంటూ ఆర్సీపీ ట్వీట్ చేశారు.



Also Read: India T20 World Cup: టీమిండియా ఓటమికి అసలు కారణం చెప్పిన రోహిత్ శర్మ.. చేసిన తప్పులు ఇవే.. 


Also Read: Money Transfer: బ్యాంక్ అకౌంట్లలో నగదు జమ.. పండగ చేసుకుంటున్న జనాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook