Money Transfer: మునుగోడు ఉప ఎన్నికల వేళ చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన సుశీ ఇన్ ఫ్రా సంస్థ నుంచి మునుగోడుకు చెందిన కొందరు ఓటర్ల అకౌంట్లకు డబ్బులు ట్రాన్స్ ఫర్ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ ఫిర్యాదు చేయగా.. కోమటిరెడ్డికి సీఈసీ నుంచి నోటీసులు వచ్చాయి. కోమటిరెడ్డి సంస్థ నుంచి ఐదు కోట్లకు పైగా నిధులు ఇతర ఖాతాలకు జమ అయ్యాయని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ వివాదం సాగుతుండగానే.... గుర్తు తెలియని వ్యక్తుల అకౌంట్ నెంబర్ల నుంచి కొంత మంది ఖాతాలకు నగదు ట్రాన్స్ ఫర్ కావడం కలకలం రేపుతోంది.
వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని ఊకల్లు, గట్టికళ్ళు గ్రామాల్లోని కొంత మంది రైతుల ఖాతాల్లోకి 10 వేల రూపాయల నుంచి 50 వేల రూపాయల వరకు నగదు జమైంది. గత రెండు, మూడు రోజులుగా ఈ తతంగం జరుగుతోంది.రాయపర్తిలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకుతో పాటు కొండాపురం కెనరా బ్యాంకు అకౌంట్లు కలిగి ఉన్న వ్యక్తులకు మాత్రమే నగదు జమ అవుతుంది. తమ ఖాతాల్లోకి అప్పనండా డబ్బులు రావడంతో జనాలు షాకయ్యారు. అయితే ఎలాంటి అకౌంట్ నెంబర్ లేకుండా తమ ఖాతాల్లోకి డబ్బులు వస్తుండటంతో ఎక్కడి నుంచి వస్తున్నాయన్నది తెలియడం లేదు. దీంతో కొందరు సంతోషం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు భయాందోళనకు గురవుతున్నారు. డబ్బులు జమ చేసి తర్వాత తమ ఖాతాల్లోని మిగితా డబ్బులు కాజేస్తారా అన్న అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. కొందరు వినియోగదారులు మాత్రం బ్యాంకులకు వెళ్లి తమకు జమైన డబ్బులను డ్రా చేసుకున్నారు. ఇక డబ్బులు పడని జనాలు మాత్రం రోజుకు రెండు, మూడు సార్లు బ్యాంకుకు వెళ్లి తమ ఖాతాలను చెక్ చేసుకుంటున్నారు. దీంతో బ్యాంక్ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు.
రైతుల అకౌంట్లలో డబ్బులు ఎలా వస్తున్నాయో బ్యాంక్ అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. ఎవరైనా కావాలనే తమ ఖాతాల్లోకి డబ్బులు వేస్తున్నారా లేక డిజిట్ నెంబర్ రాంగ్ కావడంతో అలా వచ్చి పడుతున్నాయో క్లారిటీ రావడం లేదు. బ్లాక్ మనీ ఇలా ట్రాన్స్ ఫర్ చేస్తున్నారా అన్న ఆందోళన కూడా కొందరిలో ఉంది. ఈ సంబంధించి మండలం జిల్లా వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. ఈ విషయానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియకపోవడం అటు రైతులు ఇటు స్థానికులు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు.
Also Read: India T20 World Cup: టీమిండియా ఓటమికి అసలు కారణం చెప్పిన రోహిత్ శర్మ.. చేసిన తప్పులు ఇవే..
Also Read: Hyderabad Metro Charges: మెట్రో రైలు ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్.. పెరగనున్న ఛార్జీలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook