OU JAC Chairman Arjun Nayak tried to block CM KCR Convoy: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ 2022-23 సమావేశాలు ఈరోజు ప్రారంభం అయ్యాయి. ఈసారి బడ్జెట్‌ సమావేశాలు గవర్నర్‌ ప్రసంగం లేకుండానే మొదలైన సంగతి తెలిసిందే. దాంతో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు నేరుగా బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు. రూ. 2,56,958.51 కోట్ల‌తో ఆయన బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. అయితే బడ్జెట్ సమావేశాలకు వెలుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కాన్వాయ్‌ని ఓయూ జాక్ చెర్మన్ అడ్డుకోవడానికి ప్రయత్నించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోమవారం ఉదయం బడ్జెట్ 2022-23 సమావేశాలకు వెళుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కాన్వాయ్‌ని ఓయూ జాక్ చెర్మన్ అర్జున్ నాయక్ అడ్డుకోవడానికి ప్రయత్నించారు. సీఎం అసెంబ్లీకి వెళుతున్న మార్గంలో ఆయన రోడ్డుపై బైఠాయించారు. రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే విడుదల చెయ్యాలని అర్జున్ నాయక్ డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీఎంను అసెంబ్లీకి తీసుకెళ్లారు. 

ఉద్యోగ నోటిఫికేషన్ వెయ్యాలని ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో గత నెలలో భారీ ర్యాలీ తీసిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం వచ్చి ఎనిమిది సంవత్సరాలు గడిచినా.. ఒక్క గ్రూప్1 గాని, జెల్, డీల్, గ్రూప్2 నోటిఫికేషన్ వెయ్యలేదని ఆగ్రహం వ్యక్తం చేయారు. ఉద్యోగ నోటిఫికేషన్ వేయకుండా కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఎలా జరుపుకుంటారంటూ ప్రశ్నించారు. వెంటనే 1.92 వేల ఉద్యోగాలు వెంటనే విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. 


Also Read: Telangana Budget 2022: బడ్జెట్‌ ప్రవేశపెట్టిన హ‌రీశ్‌రావు.. రూ.2.56 ల‌క్ష‌ల కోట్ల‌తో బ‌డ్జెట్‌!!


Also Read: Pooja Hegde: మా జంట బాగుందని చెబుతున్నారు.. పెళ్లెప్పుడని ప్రభాస్‌ను నేను కూడా అడిగా: పూజా హెగ్డే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook