Telangana Cabinet: రేషన్ కార్డులపై తెలంగాణ సంచలన నిర్ణయం.. మంత్రివర్గం కీలక నిర్ణయాలు ఇవే!
Telangana Cabinet Approves Issue New Ration Cards: క్రీడాకారులకు ఉద్యోగాలు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభం, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకం వంటి అంశాలపై తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.
Telangana Cabinet Decisions: అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న సమయంలో తెలంగాణ మంత్రివర్గం కీలక సమావేశం నిర్ణయించింది. మంత్రివర్గంలో కీలక అంశాలపై తీవ్ర చర్చ జరిగింది. వయనాడ్ ఘటన, రేషన్ కార్డులు, క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు, ఇంటి స్థలం కేటాయింపు, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకం, నిజాం షుగర్ ఫ్యాక్టరీ వంటి అంశాలపై చర్చ కొనసాగింది. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మంత్రిమండలిలో కీలక నిర్ణయాలు తీసుకుంది.
Also Read: Revanth Reddy: భావోద్వేగానికి లోనైన రేవంత్ రెడ్డి.. సీతక్కపై మీమ్స్‌పై కన్నీటిపర్యంతం
మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు వెల్లడించారు. కాళేశ్వరం జలాలతో హైదరాబాద్ జంట జలాశయాలు నింపాలని నిర్ణయించగా.. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు వెల్లడించారు. క్రీడాకారులు ఈషా సింగ్, నిఖత్ జరీన్, మహమ్మద్ సిరాజ్‌కు ప్రభుత్వ ఉద్యోగం, ప్రభుత్వ స్థలం ఇవ్వాలని నిర్ణయించినట్లు వివరించారు.
మంత్రివర్గ నిర్ణయాలు ఇవే..
కేరళలో వయనాడ్‌లో భారీ వర్షాలతో పాటు కొండచరియలు విరిగిపడి చాలా మంది చనిపోయారు. కేరళలో జరిగిన విషాదంపై సంతాప తీర్మానం ఆమోదం. మృతుల కుటుంబాలకు మంత్రివర్గం సానుభూతి తెలిపింది. ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయక చర్యలను అందించాలని నిర్ణయం.
- నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏడాది నిర్దిష్టమైన కాల వ్యవధిలో ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు జాబ్ క్యాలెండర్‌ను మంత్రివర్గం ఆమోదం. అసెంబ్లీలో చర్చకు పెట్టాలని నిర్ణయం.
- రేషన్ కార్డుల జారీతో పాటు రాష్ట్ర ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్‌తో హెల్త్ కార్డులను జారీ చేయాలని చర్చ. దీనికి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసేందుకు రెవెన్యూ, ఆరోగ్య, పౌర సరఫరాల మంత్రులతో ఉపసంఘం ఏర్పాటుకు నిర్ణయం.
- క్రీడాకారులు ఈషా సింగ్, నిఖత్ జరీన్, మహమ్మద్ సిరాజ్‌కు హైదరాబాద్‌లో 600 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం. జరీన్, సిరాజ్‌కు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం.
- ఇటీవల విధి నిర్వహణలో మృతిచెందిన ఇంటెలిజెన్స్ డీజీ రాజీవ్ రతన్, అదనపు డీజీ మురళి కుమారులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని మంత్రివర్గం తీర్మానం.
- గౌరవెల్లి ప్రాజెక్టు పరిధిలో అసంపూర్తిగా నిలిచిపోయిన కుడి, ఎడమ కాల్వలు పూర్తి చేయాలని నిర్ణయం. దాదాపు 2 వేల ఎకరాల భూసేకరణ చేపట్టేందుకు అవసరమయ్యే నిధులతో సవరణ అంచనాలను రూపొందించాలని నిర్ణయం.
- గవర్నర్ కోటాలో మరోసారి ప్రొఫెసర్ కోదండ రామ్, అమీర్ అలీని ఎమ్మెల్సీలుగా నియమించాలని కోరుతూ ఇద్దరి పేర్లను గవర్నర్ ఆమోదానికి పంపించాలని నిర్ణయం.
- నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయం. రెండో విడతగా చెల్లించాల్సిన బకాయిల చెల్లింపులకు ఆమోదం. అవసరమైతే ఇథనాల్, విద్యుత్తు ఉత్పత్తికి అక్కడి ఫ్యాక్టరీల్లో ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని చర్చించింది. శ్రీధర్ బాబు నేతృత్వంలో ఇప్పటికే ఏర్పాటుచేసిన మంత్రివర్గ ఉపసంఘానికి బాధ్యతలు మంత్రివర్గం అప్పగించింది.
- మల్లన్నసాగర్ నుంచి గోదావరి నీటిని శామీర్‌పేట చెరువు నింపి అక్కడి నుంచి హైదరాబాద్‌లో ఉన్న జంట జలాశయాలు ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్‌కు తరలించేందుకు మంత్రివర్గం ఆమోదం. మొత్తం 15 టీఎంసీలను తరలించి వాటితో 10 టీఎంసీలతో చెరువులు నింపి మిగతా నీటిని హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వినియోగించాలని నిర్ణయం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook