Revanth Reddy Emotional: తెలంగాణలో మహిళా ఎమ్మెల్యేలపై రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క దురుసు వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బేషరతుగా సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ బీఆర్‌ఎస్ పార్టీ పట్టుబట్టింది. ఈ డిమాండ్‌పై గురువారం అసెంబ్లీ సమావేశాలు జరగకుండా అడ్డుకుంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల నిరసనల మధ్యలోనే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీతక్కపై వస్తున్న మీమ్స్ విషయాన్ని ప్రస్తావించారు. ఆ మీమ్స్ చూస్తే తట్టుకోలేరని తెలిపారు.
'సోషల్ మీడియాలో సీతక్కపై అభ్యంతరకర పోస్టులు వస్తున్నాయి. మహిళా మంత్రులపై సోషల్ మీడియాలో బీఆర్‌ఎస్ పార్టీ వారు అసభ్య పోస్టులు పెడుతున్నారు. సీతక్కపై సోషల్ మీడియాలో అవమానించేలా మీమ్స్ పెడుతున్నారు. ఆ మీమ్స్‌ను చూపిస్తే అసెంబ్లీకే అగౌరవం. మంత్రిగా ఉన్న ఆదివాసీ ఆడబిడ్డపై బీఆర్ఎస్ వారు అలాంటి వీడియోలు చేయొచ్చా? ఆదివాసీ ఆడబిడ్డను అవమానించినట్లు కాదా?' అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
Also Read: Constable Aspirants: అర్ధరాత్రి మళ్లీ నిరుద్యోగుల ఆందోళన.. దిల్‌సుఖ్‌నగర్ దిగ్బంధం
ఏం జరిగింది?
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం చర్చలో మాజీమంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలపై రేవంత్ రెడ్డితోపాటు భట్టి విక్రమార్క అనుచిత వ్యాఖ్యలు చేశారు. 'అక్కలను నమ్మొద్దు. నమ్మితే మోసం చేస్తారు' అని రేవంత్ రెడ్డి, 'ఏం ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారు' అని భట్టి విక్రమార్క తీవ్ర వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. వెంటనే క్షమాపణలు చెప్పాలని సభ లోపల, బయట బీఆర్‌ఎస్ పార్టీ నిరసనలకు దిగింది. అయితే చర్చ సమయంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై సీతక్క చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే సీతక్కపై కొందరు సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్, మీమ్స్ చేశారు. వాటిపై రేవంత్ స్పందించి భావోద్వేగానికి గురయ్యారు. టీడీపీలో ఉన్నప్పటి నుంచి రేవంత్, సీతక్క అన్నాచెల్లెలుగా కొనసాగుతున్నారు. సీతక్క ఎప్పుడూ రేవంత్ వెంట ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి కూడా వారిద్దరూ కలిసి వెళ్లిపోయారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook