Telangana Cabinet Expansion: తెలంగాణలో ఇప్పట్లో క్యాబినేట్ విస్తరణ జరిగే అవకాశాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. కొన్ని నెలలుగా విస్తరణపై  జోరుగా ఊహాగానాలు వినిపించాయి. పైగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అనధికార అధ్యక్షుడు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో ఉన్నారు. మరోవైపు ఈ నెల మూడో వారంలో తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో బిజీగా గడపనున్నారు. ఈ పర్యటనకు ముందుకానీ, తర్వాత కానీ ఆస్ట్రేలియా, సింగపూర్‌లలో సీఎం పర్యటిస్తారు. ఇంకోవైపు సంక్రాంతి పండగ సందర్భంగా పీడ దినాలు నడుస్తున్నాయి. ఈ  నేపథ్యంలో తెలంగాణ క్యాబినేట్ విస్తరణ ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాల తర్వాత ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  ఈ క్రమంలోనే  అధిష్ఠానంతో చర్చలు జరిగాయి. ఆ తర్వాత ఫిబ్రవరిలో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో జనవరిలో మంత్రివర్గ విస్తరణకు అవకాశాలు తక్కువేనని కాంగ్రెస్‌ ముఖ్యనేతలు చెబుతున్నారు.    


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లాస్ట్ ఇయర్  జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పదేళ్ల విరామం తర్వాత అధికారంలోకి వచ్చింది. అంతేకాదు కకావికలమైన పార్టీని ఏకతాటిపై తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు అప్పటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి. ఎలక్షన్స్ లో విన్నింగ్ తర్వాత సీనియారిటీని పక్కన పెట్టి.. బయట నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికే తెలంగాణ ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించింది కాంగ్రెస్ అధిష్ఠానం. అయితే అసెంబ్లీ ఎన్నికలు అయిన వెంటనే లోక్ సభ ఎన్నికలు వచ్చి పడటంతో తెలంగాణలో మంత్రివర్గం విస్తరణ ఆలస్యమైంది. దీంతో పరి పాలన కంటే సార్వత్రిక ఎన్నికల్లో  ఎంపీ సీట్లు గెలవడంపైనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించడం జరిగింది . ఈ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 8 లోక్ సభ సీట్లను గెలుచుకుంది. అటు భారతీయ జనతా పార్టీ కూడా 8 సీట్లు గెలుచుకొని సమఉజ్జీగా నిలిచింది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి పక్కలో బల్లంగా మారింది. మరోవైపు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షంగా చుక్కలు చూపిస్తోంది.


అయితే రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్, చంద్రబాబు మాదిరే పక్క పార్టీల వారినీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే పనిలో పడ్డారు.
కొత్తగా జరిగే క్యాబినేట్ విస్తరణలో మరో ఆరుగురికి మాత్రమే ఛాన్స్ ఉంది.  ఇందులో భాగంగా మక్తల్ శాసనసభ్యుడైన వాకిటి శ్రీహరిని మంత్రి వర్గంలో తీసుకునే అవకాశాలున్నాయి. అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఈ సారి మంత్రివర్గంలో తీసుకుంటారా అనేది చూడాలి. ఆల్రెడీ రెడ్డిలతో పాటు కోమటిరెడ్డి అన్న కూడా మంత్రిగా ఉండటంతో ఈయనక మంత్రి వర్గంలో స్థానం దొరకడం అనుమానమనే చెప్పాలి. అటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ను కూడా మంత్రి పదవి దక్కడం గ్యారంటీ అని చెబుతున్నారు.  తెలంగాణలో మొత్తంగా 18 మందికి ముఖ్యమంత్రితో కలిసి క్యాబినేట్ బెర్త్  ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటికే క్యాబినేట్ లో ముఖ్యమంత్రితో కలిపి దాదాపు 4 రెడ్లకు స్థానం దక్కింది. ఇప్పటికే రేవంత్ తో కలిపితే 12 మంది ఉన్నారు. ఈ సారి విస్తరణలో 4 నలుగురికి ఛాన్స్ ఇచ్చే అవకాశాలున్నాయి. మరో 2 తర్వాత భర్తీ చేస్తారా అనేది చూడాలి.


మరోవైపు రేవంత్ రెడ్డి క్యాబినేట్ లో  ముస్లిమ్ మైనారిటీ వర్గం నుంచి ఎవరు ఆమాత్యులుగా లేరు. ఈ సారి మంత్రివర్గంలో మైనారిటీ వర్గం నుంచి ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి. సామాజిక వర్గాలుగా చూసుకుంటే.ఈ సారి మంత్రివర్గంలో మైనారిటీ, ఎస్సీ ల నుంచి మాల, మరో రెడ్డితో పాటు ఒక బీసీలకు దక్కే అవకాశాలు లేకపోలేదు.


ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..


ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.