CM Kcr Comments: తెలంగాణ ఆవిర్భావ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ సంబురం కొనసాగుతోంది. హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్‌లో జాతీయ జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.  రాష్ట్ర ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా 8 ఏళ్ల పాలనలో చేపట్టిన కార్యక్రమాలు, జరిగిన ప్రగతిని జాతిని ఉద్దేశించిన వివరించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలో ఎన్నో అద్భుత పథకాలను తీసుకొచ్చామన్నారు సీఎం కేసీఆర్. దేశానికే ఆదర్శంగా ఉండేలా పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఐటీ, పారిశ్రామిక రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. 2014-19 మధ్య 17.24 శాతం వృద్ధి రేటు సాధించామని...దేశంలోనే తొలి స్థానంలో నిలిచామని స్పష్టం చేశారు. విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధి సాధించామని తెలిపారు. 


దేశంలోని ఇతర రాష్ట్రాలకు మిషన్ భగీరథ పథకం ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో లక్షా 35 వేల ఉద్యోగాలకు భర్తీ చేశామని చెప్పారు. మరో 90 వేల ఉద్యోగాలు త్వరలో భర్తీ చేస్తామన్నారు. స్థానిక అభ్యర్థులకు 95 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సమైక్య పాలనతో పోల్చితే అన్ని రంగాల్లో గణనీయమైన మార్పులు తీసుకొచ్చామని వెల్లడించారు. 


దళిత బంధుతో దళితులకు అండగా నిలుస్తున్నామన్నారు సీఎం కేసీఆర్. ఆర్థిక వృద్ధి, తలసరి ఆదాయం పెరుగుదలతోపాటు ఇతర రంగాల్లో అభివృద్ధి సాధించామని గుర్తు చేశారు. ఇప్పటికే 15 లక్షలకు పైగా ఎకరాలకు స్థిరీకరణ చేసుకున్నామని..ఎస్సీల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. దళిత బంధు కోసం 17 వేల 700 కోట్లు కేటాయించామని సీఎం కేసీఆర్ చెప్పారు. 


రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా కేంద్రంపై మరోమారు ఫైర్ అయ్యారు. ఉమ్మడి జాబితా పేరుతో రాష్ట్రాలపై కేంద్ర పెత్తనం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తెలంగాణ పట్ల అడుగడుగునా వివక్ష చూపిస్తోందని విమర్శించారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి లోబడే రుణాలు సేకరిస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రాలపై విధిస్తున్న ఆర్థిక ఆంక్షలను ఇప్పటికైనా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి సరైన లక్ష్యం లేదని..వారిది గాలి వాటు పరిపాలన అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.


Also read:India Corona: దేశంలో మరో వేవ్‌ రాబోతోందా..ఇవాళ కేసుల సంఖ్య ఎంతంటే..!


Also read:Telangana Formation Day: ఢిల్లీలో తెలంగాణ సంబురం..పాల్గొననున్న అమిత్ షా..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook