Rythu Bharosa: రైతు భరోసాపై  తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏటా రూ. 12 వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి  రేవంత్‌రెడ్డి ప్రకటించారు. భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు కూడా ఏటా రూ. 12 వేలు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాళ్లు, రప్పలు, గుట్టలు, రోడ్ల నిర్మాణంలో పోయిన భూములు, మైనింగ్‌ భూములు, నాలా కన్వర్షన్‌ పొందిన భూములు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, పరిశ్రమల కోసం సేకరించిన భూములు, రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయబోమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.


అయితే ప్రభుత్వ నిర్ణయంపై పలు విమర్శలు వస్తున్నాయి. గతంలో బాడాబాబులకు రైతు బంధు దోచి పెడుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కాని ఇప్పుడు వాళ్లు కూడా రైతు భరోసాపై ఎలాంటి సీలింగ్ పెట్టలేదు. వందల ఎకరాల రైతులకు రైతు భరోసా ఇవ్వనున్నారు. ఇక వ్య‌వ‌సాయ‌యోగ్యం అంటూ మ‌ళ్లీ ఫైర‌వీల‌కు బాట‌లు వేశారనే టాక్ వస్తోంది. సాగు నిర్దార‌ణ కోసం అధికారుల‌పై నేత‌ల ఒత్తిళ్లు ఉంటాయంటున్నారు.  రైతుభ‌రోసా కూడా రైతుబంధులా స‌ర్కార్‌ను బ‌ద్నాం చేసే ప‌థ‌క‌మే అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..


ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.