CM KCR: వ్యాక్సిన్ పంపిణికి సర్వం సిద్ధం..ప్రధానితో సీఎం కేసీఆర్
CM KCR On Corona Vaccine | కోవిడ్-19 టీకా పంపిణికి అంతా సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు. టీకా శాస్త్రీయంగా సిద్ధం అయితే దాన్ని ప్రజలకు పంపిణీ చేయడానికి పక్కా ప్రణాళిక ఉందని తెలిపారు.
KCR On Corona Vaccine Distribution | కోవిడ్-19 టీకా పంపిణికి అంతా సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు. టీకా శాస్త్రీయంగా సిద్ధం అయితే దాన్ని ప్రజలకు పంపిణీ చేయడానికి పక్కా ప్రణాళిక ఉందని తెలిపారు. దాంతో పాటు కోవిడ్-19 టీకా వల్లా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అని తెలిపారు.
Also Read | AP Govt: ఏపీలో కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణి ఎలా జరగనుందో తెలిపిన జగన్
దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ ( Narendra Modi ) ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ లో సమావేశం అయ్యారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే వాటిని శాస్త్రీయ పద్ధతిలో పంపిణి చేస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్ ( KCR ) ప్రజలు వ్యాక్సిన్ కోసం వేచి చూస్తున్నారు అని..ఈ సమయంలో శాస్త్రీయంగా సిద్ధం అయిన వ్యాక్సిన్ అవసరం ఉంది అని అన్నారు. ప్రాధాన్యతను బట్టి అవసరం అయిన వారికి ముందుగా వ్యాక్సిన్ అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని తెలిపారు. మన దేశంలో ఉన్న వాతావరణాన్ని బట్టి రానున్న వ్యాక్సిన్ పని చేయనుందా లేదా అని తెలుసుకోవడం చాలా అవసరం అని.. దాన్ని బట్టి టీకా అందించాల్సి ఉంటుంది అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
Also Read | TRS Manifesto: టీఆర్ఎస్ హెచ్ఎంసీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల, కీలక అంశాలివే
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR