Telangana CM K Chandrashekar Rao paid rich homage to the police personnel who were martyred while discharging their duties: పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు సీఎం కేసీఆర్‌ (CM KCR) నివాళులర్పించారు. వారి సేవలను స్మరించుకున్నారు కేసీఆర్. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాణాలొడ్డి పోరాడిన పోలీసు అమరుల సేవలను జాతి ఎన్నటికీ మరువదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అమరవీరుల స్ఫూర్తితో పోలీసులు తమ విధి నిర్వహణకు అంకింత కావాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. అమరులైన పోలీస్‌ కుటుంబాలను ఆదుకునేందుకు వారి సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సీఎం కేసీర్ తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం (Police Commemoration Day) సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగాలను తెలంగాణవ్యాప్తంగా పోలీస్‌శాఖ స్మరించుకుంది. హైదరాబాద్‌లో హోంమంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. తెలంగాణ ప్రభుత్వ చొరవతో పోలీసు వ్యవస్థ బలపడిందని డీజీపీ మహేందర్‌ రెడ్డి అన్నారు. గోషామహల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్‌ అలీ, (Mahmood Ali) డీజీపీ మహేందర్‌ రెడ్డి, (DGP Mahender Reddy) సీపీ అంజనీ కుమార్‌, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


Also Read : India Crosses 1 Billion Vaccination: భళా 'భారత్'.. 100 కోట్ల టీకాల పంపిణీ పూర్తి


ఇక తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) పోలీసు అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. అమరులైన పోలీసు కుటుంబాలను ఆదుకోవడానికి, వారి సంక్షేమానికి సీఎం కేసీఆర్ (CM KCR) నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు గుర్తు చేశారు.


Also Read : AP CM YS Jagan : అధికారం దక్కలేదనే అక్కసుతోనే కుట్రలు, సీఎంపైనా అసభ్య పదజాలమా? - సీఎం వైఎస్ జగన్‌


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి