Motkupalli Narsimhulu joins TRS: టీఆర్ఎస్ పార్టీలో చేరిన మోత్కుపల్లి నర్సింహులు

Motkupalli Narsimhulu joins TRS: సీఎం కేసీఆర్ సమక్షంలో మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి నర్సింహులుకు పార్టీ కండువా కప్పిన సీఎం కేసీఆర్.. ఆయన్ను పార్టీలోకి సాదరంగా స్వాగతిస్తున్నట్టు తెలిపారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 18, 2021, 04:44 PM IST
  • CM KCR సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్న మోత్కుపల్లి నర్సింహులు.
  • మోత్కుపల్లి నర్సింహులుపై ప్రశంసలు గుప్పించిన సీఎం కేసీఆర్
  • Motkupalli Narsimhulu అనుభవాన్ని ఉపయోగించుకుంటామని ప్రకటించిన సీఎం కేసీఆర్
Motkupalli Narsimhulu joins TRS: టీఆర్ఎస్ పార్టీలో చేరిన మోత్కుపల్లి నర్సింహులు

Motkupalli Narsimhulu joins TRS: మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ కార్యక్రమంలో పార్టీ అధినేత అయిన సీఎం కేసీఆర్ సమక్షంలో మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి నర్సింహులుకు పార్టీ కండువా కప్పిన సీఎం కేసీఆర్.. ఆయన్ను పార్టీలోకి సాదరంగా స్వాగతిస్తున్నట్టు తెలిపారు.

CM KCR speech about Motkupalli Narsimhulu and Dalita Bandhu scheme: సీఎం కేసీఆర్ ప్రసంగంలోంచి పలు ముఖ్యాంశాలు:

-> పార్టీలతో సంబంధం లేకుండా ప్రతీ దళిత కుటుంబానికి దళిత బంధు పథకం ఫలాలు అందిస్తాం.

-> మోత్కుపల్లి నర్సింహులు మంచి అనుభవజ్ఞులు. రాష్ట్రాభివృద్ధికి, దళితుల అభ్యున్నతికి ఆయన సేవల్ని (CM KCR about Motkupalli Narsimhulu) వినియోగించుకుంటాం.

-> దళిత బంధు పథకం అమలుకు అడ్డుపటే వాళ్లను దాటేసి ముందుకు సాగిపోవాలి. అందుకోసం దళిత బంధు పథకాన్ని (Dalit bandhu scheme) ఒక ఉద్యమంలా, ఒక యజ్ఞంలా కొనసాగించేందుకు ప్రతీ ఒక్కరి సహకారం అవసరం. 

Also read : KCR campaign : దూకుడు పెంచిన టీఆర్‌ఎస్.. 27న హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారానికి కేసీఆర్‌

-> దళిత బంధు పథకం ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గానికో (Huzurabad bypolls) లేక దళిత ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకో అని కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు విస్తరిస్తాం. 

-> దళిత బంధు పథకం తరహాలోనే ఆ తర్వాత అన్ని ఇతర సామాజికవర్గాల వారికి కూడా ఇలాంటి పథకాలను విస్తరించి వారి అభివృద్ధికి కృషి చేస్తాం.

-> అంబేద్కర్ పుణ్యమా అని కొంతమంది దళితులకు ఉద్యోగాలొచ్చాయి. బతుకులు బాగుపడ్డాయి. ఆ తర్వాత ఆయన ఆశయాలు ముందుకు సాగలేదు. అందుకే వారికి కూడా మంచి భవిష్యత్తును అందించాలనే సదుద్దేశంతోనే దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది.

-> దళితుల అభివృద్ధి కోసం లక్షా 70 వేల కోట్ల వ్యయంతో ప్రవేశ పెడుతున్న దళిత బంధు పథకంపై (Dalita Bandhu Scheme) అవాకులు, చెవాకులు పేలుతున్నారు.
Also read : 
CM KCR: ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదు: సీఎం కేసీఆర్‌ 
-> భూమి మ్యుటేషన్ కోసం ఒకప్పుడు లంచం ఇవ్వందే పని కాని పరిస్థితి ఉండేది. కాని ఇప్పుడు ధరణి వచ్చాకా అవినీతికి అడ్డుకట్ట పడింది. ఇకపై భూమిని అమ్మితేనో లేక కొంటేనో, రిజిస్ట్రేషన్ చేస్తేనో, వారసత్వంతో వస్తేనో.. బహుమతి కింద ఇస్తేనో తప్ప మీ ప్రమేయం లేకుండా భూమి ఇంకొకరి పేరుపైకి మారే అవకాశమే లేదు అని సీఎం కేసీఆర్ దరణి పోర్టల్ (Dharani Portal) ప్రయోజనం గురించి మరోసారి వివరించారు.

-> ఆడపిల్ల పెళ్లి చేసేందుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డురావొద్దనే ఉద్దేశంతో ప్రవేశపెట్టింది  కల్యాణ లక్ష్మీ పథకం (Shaadi Mubarak) అని చెబుతూ కళ్యాణలక్ష్మి పథకం వెనుకున్న లక్ష్యాన్ని సీఎం కేసీఆర్ (CM KCR) మరోసారి గుర్తుచేశారు.

Also read : Vaccination Mistakes in Telangana: 2 నెలల కింద చనిపోయిన వ్యక్తికి ఈ నెల 12 న టీకా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News