హైదరాబాద్: కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు చిత్తశుద్ధితో సేవలు అందిస్తున్న వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది, మున్సిపల్, పంచాయతీ కార్మికులు అలాగే జీహెచ్ఎంసి, హెచ్ఎండబ్లూఎస్ విభాగాల సిబ్బందికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వివిధ రూపాల్లో గుడ్ న్యూస్ అందించారు. వైద్య సిబ్బందికి గ్రాస్ శాలరీపై 10 శాతం వేతనాలు పెంచుతున్నట్టు తెలిపారు. అదేవిధంగా పారిశుద్య కార్మికుల వేతనాల్లో విధించిన కోతను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించిన సీఎం కేసీఆర్.. మున్సిపల్ శాఖ, పంచాయతీ కార్మికులకు ముఖ్యమంత్రి ప్రోత్సాహకం కింద రూ 5 వేలు, జీహెచ్ఎంసి(GHMC), హెచ్ఎండబ్ల్యుఎస్ (HMWS) సిబ్బందికి రూ.7,500 ప్రోత్సాహకం కింద అందిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. సోమవారం రాత్రి ప్రగతి భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో కరోనావైరస్ నివారణకు తీసుకుంటున్న చర్యలను మీడియాకు వెల్లడించే క్రమంలో సీఎం కేసీఆర్ ఈ వివరాలను ప్రకటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : Watch video: కేంద్రం లాక్ డౌన్ ఎత్తేసినా.. రాష్ట్రంలో నేను కొనసాగిస్తా: సీఎం కేసీఆర్


ఈ సందర్భంగా కరోనా వైరస్ వ్యాప్తిపై సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ.. ఇది మానవ జాతి మొత్తం ఎదుర్కొంటున్న సంక్షోభం అని అన్నారు. శరీరంలో వైరస్ తక్కువ మోతాదులో సోకిన వాళ్ళు మాత్రమే బతుకుతున్నారు మిగతా రోగులు అత్యంత దయనీయంగా చనిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. కరోనాను కంట్రోల్ చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌కు ప్రజలు అద్భుతంగా సహకరిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను అభినందించారు.


Also read : కరోనావైరస్ ఎక్కువైన జిల్లాల జాబితా.. దేశంలోనే 4వ స్థానంలో హైదరాబాద్


అయితే, అదే సమయంలో అవాస్తవ కథనాలు, వదంతులను వ్యాపింపచేస్తున్న వారిపైనా సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఓవైపు కరోనాతో లోకం లోకమే ఆగమైతంటే గీ టైమ్‌లో శవాల మీద పేలాలు ఏరుకుండు ఏందని ఆగ్రహం వ్యక్తంచేసిన ఆయన.. అటువంటి వారికి సరైన సమయంలో సరైన శిక్ష విధిస్తామని హెచ్చరించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..