న్యూ ఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా గత 13 రోజులుగా యావత్ భారత్ లాక్డౌన్లో ఉంది. కరోనా వైరస్ని నివారించడానికి ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధానాన్నే సరైన మార్గంగా ఎంచుకున్నాయి. భారత్ సైతం మార్చి 24 అర్థరాత్రి నుంచి లాక్ డౌన్ విధించడమే కాకుండా పకడ్బందీగా అమల్యయేలా చూస్తోంది. అయినప్పటికీ గత వారం రోజుల్లో భారత్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగానే పెరిగాయి. ఏప్రిల్ 1న భారత్లో 1,834 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఉండగా... సోమవారం ఉదయం 9 గంటల వరకు అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఆ సంఖ్య 4,067కి చేరుకుంది. భారత్లో మొత్తంగా కరోనా కాటుకు బలైన వారి సంఖ్య 109 దాటింది. చనిపోయిన వారిలో 63 శాతం మంది 60కిపైగా వయసుపైబడినవారే కావడం గమనార్హం. మరో 30 శాతం మంది మృతులు 40-60 ఏళ్ల మధ్య వయసు వారు కాగా.. మిగతా 7 శాతం మంది 40 ఏళ్లలోపు వారుగా కేంద్ర, వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
Also Read : లాక్డౌన్ కొనసాగింపుపై ఎయిమ్స్ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు
తేదీల వారీగా పెరిగిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య వివరాలిలా ఉన్నాయి.
తేదీ | కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య | మృతుల సంఖ్య |
ఏప్రిల్ 1 | 1,834 | 41 |
ఏప్రిల్ 2 | 2,069 | 53 |
ఏప్రిల్ 3 | 2,547 | 62 |
ఏప్రిల్ 4 | 3,072 | 75 |
ఏప్రిల్ 5 | 3,577 | 83 |
ఏప్రిల్ 6 | 4,067 | 109 |
Read also : నిర్మాత కూతురికి కరోనా.. క్వారంటైన్లో కుటుంబం