CM KCR on Budget 2022:  కేంద్రం బడ్జెట్ (Union Budget 2022-23) పై తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా గోల్ మాల్ బడ్జెట్ అని ఆయన విమర్శించారు. దశ దిశా లేని బడ్జెట్ అని కేసీఆర్ అన్నారు. ఈ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను నిరాశ పరిచిందని ఆయన అన్నారు. ఆర్థిక మంత్రి ప్రసంగం అంతా డోల్లేనని సీఎం ఆరోపించారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వ్యవసాయ రంగానికి జీరో బడ్జెట్ గా సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఐటీ పన్ను  స్లాబ్స్ మార్చకపోవడం విచారకరమని ఆయన అన్నారు. కరోనా కష్ట కాలంలో ఆరోగ్య రంగాన్ని పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఉద్యోగుల ఆశలపై బడ్జెట్ నీళ్లు చల్లిందని విమర్శించారు.  మౌలిక వసతుల పురోగతికి చర్యలు చేపట్టలేదన్నారు.


తాజా బడ్జెట్‌లో (Budget 2022) ప్రభుత్వం ప్రధానంగా 7 రంగాలపై దృష్టి సారించినట్లు నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) ప్రకటించారు. పీఎం గతిశక్తి, అభివృద్ధి, ఉత్పాదకత, అవకాశాలు, శక్తివనరులు, వాతావరణ మార్పులపై అధ్యయనం, పెట్టుబడులకు చేయూత లాంటి మొత్తం ఏడు అంశాలపై దృష్టిసారిస్తాం అని మంత్రి తెలిపారు.


ప్రజా వ్యతిరేక బడ్జెట్: సీపీఎం
కేంద్ర బడ్జెట్‌పై సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury) స్పందించారు. దీన్ని ప్రజావ్యతిరేక బడ్జెట్‌గా పేర్కొన్నారు. గత రెండేళ్లలో ప్రజల కష్టాలు విపరీతంగా పెరిగిన సమయంలో ఆహారం, ఎరువులు, పెట్రోలియంపై సబ్సిడీలు తగ్గించారంటూ మండిపడ్డారు.  ప్రజల జీవనోపాధిపై ఇదో క్రూరమైన దాడిగా అభివర్ణిస్తూ ట్వీట్‌ చేశారు.



Also read: Budget 2022 Updates: క్రిప్టోకరెన్సీపై ఉక్కుపాదం, త్వరలో సొంతంగా డిజిటల్ రూపీ విడుదల


Also readBudget 2022 Live Updates: దేశంలో 5 జి స్పెక్ట్రమ్ వేలం వచ్చే ఏడాదిలోనే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook