Budget 2022: సగటు ఉద్యోగికి నిరాశే.. ఆదాయపు పన్ను మినహాయింపులపై లభించని ఊరట!

Budget 2022: సగటు ఉద్యోగికి బడ్జెట్​ 2022లో నిరాశే ఎదురైంది. తాజాగా ప్రవేశ పెట్టిన ఈ బడ్జెట్​లో ఉద్యోగులకు ఊరటనిచ్చే అంశాలు కనిపించలేదంటున్నారు విశ్లేషకులు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 1, 2022, 02:08 PM IST
  • వేతన జీవులకు మరోసారి నిరాశ
  • వెలువడని పన్ను మినహాయింపు పెంపు ప్రకటన
  • 2022-23 పద్దు అంచనా రూ.39 లక్షల కోట్లు!
Budget 2022: సగటు ఉద్యోగికి నిరాశే.. ఆదాయపు పన్ను మినహాయింపులపై లభించని ఊరట!

Budget 2022: భారీ అంచనాల నుడుమ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ పార్లమెంట్​లో బడ్జెట్​ 2022-23ని ప్రవేశపెట్టారు. వృద్ధికి ఊతమందించే దిశగా పలు కీలక నిర్ణయాలను బడ్జెట్​లో ప్రకటించారు ఆర్థిక మంత్రి. ఈ సారి బడ్జెట్ అంచనా రూ.39 లక్షల కోట్లుగా వెల్లడించారు. మరి బడ్జెట్​పై వేతన జీవులు ఏమంటున్నారంటే..

వేనత జీవులకు దక్కని ఊరట..

బడ్జెట్​ 2022పై భారీ ఆశలు పెట్టుకున్న వేతన జీవులకు మరోసారి నిరాశే ఎదురైంది. ఈ సారైనా పన్ను మినహాయింపు పెంపు ఉంటుందని భావించినా బడ్జెట్​లో అలాంటి ప్రకటన వెలువడలేదు. దీనితో వేతన  జీవులు నిరాశ చెందుతున్నారు.

వ్యక్తిగత ఆదాయపు పన్ను రేట్లలోను ఎలాంటి మార్పులపై ప్రకటన చేయలేదు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. ఆదాయపు పన్ను శ్లాబుల్లోనూ పెద్దగా మార్పులు చేయలేదు.

ద్రవ్యోల్బణం పెరుగుతండటం, కరోనా మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో సాండర్డ్​ డిడక్షన్​ను పెంచేందుకు సుముఖత వ్యక్త చేయలేదు కేంద్రం.

ప్రస్తుతంరూ రూ.50 వేలుగా ఉన్న స్టాండర్డ్​ డిడక్షన్​ను రూ.లక్షకు పెంచుతుందని బడ్జెట్​పై ఆశలు పెట్టుకున్నారు వేతన జీవులు. మరోవైపు వర్క్​ ఫ్రం హోంకు పన్ను లేని అలెవ్సులు ప్రకటించొచ్చని ఆశించారు. వీటిపై బడ్జెట్​లో ప్రకటన లేకపోవడం గమనార్హం.

ఐటీ రిటర్నుల విషయంలో మాత్రం స్వల్ప ఊరట కల్పించారు ఆర్థిక మంత్రి. ఎవరైనా ఐటీఆర్ సమర్పించిన తర్వాత తప్పులు దొర్లినా, తప్పుగా ఫైలింగ్ చేసినా వాటిని సవరించుకునేందుకు రెండేళ్ల వరకు అవకాశం ఉంటుదంని చెప్పారు.

బడ్జెట్​ కొన్ని కీలక ప్రకటనలు..

పన్నులు తగ్గింపు వంటి విషయంలో ఊరటనివ్వనప్పటికీ.. సామాన్యులకోసం కొన్ని కీలక నిర్ణయాలను ప్రకటించింది కేంద్రం.

కరోనా మహమ్మారి నేపథ్యంలో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సహాయం చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఇందుకోసకం  సెంటర్స్​ ఆఫ్ ఎక్సలెన్స్​ ప్రోగ్రామ్​ను ప్రారంభించనున్నట్లు తెలిపింది.

ఈ ప్రోగ్రామ్​ ద్వారా కొవిడ్​ వల్ల మానసికంగా ఇబ్బందులు పడుతున్న వారికి నాణ్యమైన కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Also read: Budget 2022 Updates: క్రిప్టోకరెన్సీపై ఉక్కుపాదం, త్వరలో సొంతంగా డిజిటల్ రూపీ విడుదల

Also read: Budget 2022 Live Updates: దేశంలో 5 జి స్పెక్ట్రమ్ వేలం వచ్చే ఏడాదిలోనే

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News