CM Kcr on BJP: ఢిల్లీలో వచ్చేది మన ప్రభుత్వమే..మరోమారు ప్రధాని మోదీపై కేసీఆర్ ధ్వజం..!
CM Kcr on BJP: నిజామాబాద్‌లో నూతన కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం భారీ బహిరంగసభలో పాల్గొన్నారు. ఈసందర్భంగా బీజేపీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు.
CM Kcr on BJP: దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ స్పీడ్ పెంచారు. మరోమారు బీజేపీ ప్రభుత్వమే టార్గెట్‌గా ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో ఢిల్లీలో మన ప్రభుత్వమే రాబోతోందని స్పష్టం చేశారు. దేశంలో నాన్ బీజేపీ జెండా ఎగురబోతోందన్నారు. దేశ రాజకీయాల్లోకి వెళ్లాలని తనను ఆశీర్వదించాలని రాష్ట్ర ప్రజలను కోరారు. 2024 తర్వాత బీజేపీయేతర ప్రభుత్వం వస్తే దేశ రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తానని హామీనిచ్చారు.
2024 ఎన్నికల్లో బీజేపీ ముక్త్ భారత్ నినాదంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న బీజేపీ నేతలకు మీటర్లు పెట్టాలన్నారు. దేశంలో ప్రతిపక్ష గవర్నమెంట్లను కూలగొట్టడమే బీజేపీ నేతల పని అని మండిపడ్డారు సీఎం కేసీఆర్. త్వరలో జాతీయ రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభిస్తానని స్పష్టం చేశారు. పచ్చని పంటలు కావాలా..మత పిచ్చి మంటలు కావాలా అని ప్రశ్నించారు.
దేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపాలన్నారు సీఎం కేసీఆర్. ఎన్నో పోరాటాల తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిందని స్పష్టం చేశారు. ఇందు కోసం ఎన్నో కష్టాలు పడ్డామన్నారు. 8 ఏళ్ల పాలనలో ఎన్నో పథకాలు తీసుకొచ్చామని గుర్తు చేశారు. దేశంలోనే 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్న రాష్ట్రం మనదేనని తెలిపారు. నిజామాబాద్ జిల్లాను అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు.
నిజామాబాద్ పాత కలెక్టరేట్ భవనం ఉన్న చోట ఇందరూ కళాభారతి ఆడిటోరియం నిర్మిస్తామన్నారు సీఎం కేసీఆర్. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం అభివృద్ధికి రూ.వంద కోట్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఉమ్మడి జిల్లాలోని 8 నియోజకవర్గాల అభివృద్ధికి గతంలో ఇచ్చిన ఎమ్మెల్యే ఫండ్స్‌కు అదనంగా రూ.10 కోట్ల నిధులిస్తున్నామన్నారు. దళితు బంధు పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ వచ్చాక రూపురేఖలను మార్చుకున్నామని తెలిపారు.
3 వేల 600 తండాలను గ్రామ పంచాయతీలుగా చేశామన్నారు సీఎం కేసీఆర్. గురుకుల పాఠశాలలను పెట్టుకున్నామని..నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఆయన పర్యటించారు. టీఆర్ఎస్ పార్టీ ఆఫీసును తొలుత ప్రారంభించారు. ఆ తర్వాత నూతన కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు.
Also read:Asia Cup 2022: కోహ్లీ ఎప్పటికీ రన్ మిషనే..విరాట్‌పై భారత మాజీ స్టార్ ప్లేయర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
Also read:Kabul: కాబుల్‌లో ఆత్మాహుతి దాడి..20 మంది మృతి..పలువురికి గాయాలు..!
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి