CM KCR Mumbai Tour: ముంబయి చేరుకున్న సీఎం కేసీఆర్.. కాసేపట్లో ఉద్ధవ్ థాక్రేతో భేటీ!
CM KCR Mumbai Tour : కేంద్రంలో భాజపా వ్యతిరేక కూటమి ఏర్పాటుకు మద్దతు కూడగట్టే వ్యూహంలో భాగంగా...తెలంగాణ సీఎం కేసీఆర్ ముంబయికి వెళ్లారు.
CM KCR Mumbai Tour : భాజపాకి వ్యతిరేకంగా ప్రతిపక్షపార్టీలను ఏకం చేయడంలో భాగంగా... సీఎం కేసీఆర్ (CM KCR) ముంబయికి వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన అక్కడకు చేరుకున్నారు. కాసేపట్లో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో (CM Uddhav Thackeray) భేటీ కానున్నారు. తాజా పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై ఇద్దరు సీఎంలు చర్చించనున్నారు.
కేంద్రంలో భాజపా సర్కారుకు వ్యతిరేకంగా గళం విప్పుతున్న కేసీఆర్.. ఇవాళ పలు కీలక భేటీల్లో పాల్గొననున్నారు. ఇవాళ ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌తో (Sharad Pawar) కూడా సమావేశం కానున్నారు. ఆయన వెంట ఎమ్మెల్సీ కవిత, ఎంపీలు సంతోష్, రంజిత్‌రెడ్డి, బి.బి.పాటిల్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శ్రవణ్‌కుమార్ ముంబయి వెళ్లారు. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కీలక భేటీల తర్వాత నేటి రాత్రి 7.20 గంటలకు ముంబయి (Mumbai) నుంచి సీఎం కేసీఆర్ తిరుగుపయనమవుతారు.
భాజపాని దేశం నుంచి తరిమికొట్టాలని, లేదంటే దేశం నాశనమైపోతుందని గతంలో కేసీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. బీజేపీని (BJP) అధికారం నుంచి తరిమికొట్టేందుకు రాజకీయ శక్తులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. బీజేపీకి వ్యతిరేకంగా వివిధ ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాల్లో భాగంగా కేసీఆర్ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కూడా కలవాలని యోచిస్తున్నారు. ఇటీవల మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ కేసీఆర్ కు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్డీయేతర పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు త్వరలో ఢిల్లీలో సమావేశాన్ని నిర్వహిస్తారని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా గతంలో చెప్పారు.
Also Read: Jaggareddy on Resignation: రాజీనామా నిర్ణయాన్ని వాయిదా వేసుకున్న జగ్గారెడ్డి.. కారణమిదే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook