Jaggareddy on Resignation: రాజీనామా నిర్ణయాన్ని వాయిదా వేసుకున్న జగ్గారెడ్డి.. కారణమిదే..

Congress MLA Jaggareddy Postpones his resignation to Congress: రాజీనామాకు సిద్ధపడి కాంగ్రెస్‌లో ప్రకంపనలు రేపుతున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి తాజాగా మీడియా ముందుకు వచ్చారు. తన రాజీనామా నిర్ణయంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 20, 2022, 02:12 PM IST
  • రాజీనామా నిర్ణయం వాయిదా వేసుకున్న జగ్గారెడ్డి
  • 15 రోజుల తర్వాత నిర్ణయం ప్రకటిస్తానని వెల్లడి
  • సోనియా, రాహుల్‌లతో అపాయింట్‌మెంట్‌కి ప్రయత్నాలు
Jaggareddy on Resignation: రాజీనామా నిర్ణయాన్ని వాయిదా వేసుకున్న జగ్గారెడ్డి.. కారణమిదే..

Congress MLA Jaggareddy Postpones his resignation to Congress: కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తన రాజీనామా నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. సీనియర్ల విజ్ఞప్తిని గౌరవిస్తూ 15 రోజుల పాటు వేచి చూడనున్నట్లు తెలిపారు. ఈ 15 రోజుల్లో తన ఆవేదనకు మందు దొరుకుతుందేమో చూడాలన్నారు. ఆ తర్వాతే రాజీనామపై నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పెద్దలు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, అగ్ర నేత రాహుల్ గాంధీలతో అపాయింట్‌మెంట్ ఇప్పిస్తే.. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై వారితో చర్చిస్తానని చెప్పారు. ఒకవేళ అపాయింట్‌మెంట్ దొరక్కపోతే 15 రోజుల తర్వాత తన రాజీనామా నిర్ణయంపై స్పందిస్తానని చెప్పారు.

జగ్గారెడ్డి వ్యవహారం టీ కప్పులో తుఫాన్ లాంటిదని టీపీసీసీ చీఫ్ రేవంత్ వ్యాఖ్యానించడాన్ని ఆయన తప్పు పట్టారు. టీ కప్పు వ్యాఖ్యలు పక్కనపెట్టి సమస్య మూలాలపై దృష్టి పెట్టాలన్నారు. పార్టీ నాయకత్వంపై తనకేమీ కోపం లేదని.. సమస్యకు పరిష్కారం దొరకుతుందని భావిస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా తమిళనాడు రాజకీయాల గురించి ప్రస్తావించారు జగ్గారెడ్డి. కరుణానిధి-జయలలిత మధ్య ఎంత రాజకీయ వైరం ఉండేదో చెప్పిన జగ్గారెడ్డి.. ఆ తర్వాత తమిళనాడులో పరిస్థితులు మారిపోయాయన్నారు. జయలలిత చనిపోయినప్పుడు కరుణానిధి మాట్లాడుతూ.. తాను జయలలిత ఓటమిని కోరుకున్నాను కానీ ఆమె చావును కోరుకోలేదని వ్యాఖ్యానించాడన్నారు. దీని నుంచి చాలామంది నేర్చుకోవాల్సి ఉందని.. అందుకే ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నానని చెప్పుకొచ్చారు.
 

రాజీనామాపై మెత్తబడ్డారా అన్న మీడియా ప్రశ్నకు ఇప్పటికైతే తాను మెత్తబడలేదని చెప్పారు. ఏదేమైనా వీహెచ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితర సీనియర్ నేతల బుజ్జగింపు ప్రయత్నాలు కాస్త ఫలించినట్లుగానే కనిపిస్తాయి. అందుకే జగ్గారెడ్డి తన రాజీనామా నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి శనివారం (ఫిబ్రవరి 19) మధ్యాహ్నమే ఆయన రాజీనామా ప్రకటించబోతున్నట్లు ప్రచారం జరిగినప్పటికీ.. సీనియర్లు రంగంలోకి దిగడంతో సీన్ మారినట్లు కనిపిస్తోంది. రాజీనామాపై నిర్ణయం తీసుకునేందుకు 15 రోజుల డెడ్ లైన్ విధించుకున్నట్లు జగ్గారెడ్డి ప్రకటించిన నేపథ్యంలో.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్  నేరుగా ఆయనతో సంప్రదింపులు జరిపి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తారా చూడాలి.

Also Read: Amazon Hitachi AC: సమ్మర్ వచ్చేస్తోంది.. రూ.4,687 ధరకే ఎయిర్ కండిషనర్.. ఈరోజే తుదిగడువు!

Also Read: Harley Davidson New Electric Bike: హార్లే డేవిడ్సన్ నుంచి మరో ఎలక్ట్రిక్ బైక్.. లాంచింగ్ ఎప్పుడంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News