TRS VS BJP: పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీపై యుద్దం.. రేపు టీఆర్ఎస్ ఎంపీలతో కేసీఆర్ సమావేశం
TRS VS BJP: కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరింత దూకుడు పెంచుతున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీని ఇరుకున పెట్టేలా వ్యూహరచన చేస్తున్నారు. ఈ నెల 18 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలు కానున్నాయి. దీంతో ఉభయ సభల్లో టిఆర్ఎస్ అనుసరించాల్సిన విధివిధానాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం కేసీఆర్
TRS VS BJP: కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరింత దూకుడు పెంచుతున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీని ఇరుకున పెట్టేలా వ్యూహరచన చేస్తున్నారు. ఈ నెల 18 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలు కానున్నాయి. దీంతో ఉభయ సభల్లో టిఆర్ఎస్ అనుసరించాల్సిన విధివిధానాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం కేసీఆర్. ఇందుకోసం శనివారం మధ్యాహ్నం 1 గంటకు ప్రగతిభవన్ లో సమావేశం నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్ తో జరగనున్న సమావేశానికి టీఆర్ఎస లోక్ సభ, రాజ్యసభ సభ్యులు హాజరుకానున్నారు. మోడీ సర్కార్ ప్రజావ్యతిరేక విధానాలపై పార్లమెంట్ లో పోరాడాలని సిఎం కెసిఆర్ తన పార్టీలకు పిలుపు ఇవ్వనున్నారని తెలుస్తోంది.
తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందని, అన్ని రంగాల్లో నష్టం చేసేలా వ్యవహరిస్తుందని ఆరోపిస్తున్న టీఆర్ఎస్.. ఈ విషయాన్ని పార్లమెంట్ వేదికగా ప్రస్తావించాలని నిర్ణయించిందని తెలుస్తోంది. ఆర్ధిక క్రమశిక్షణను పాటిస్తూ వేగంగా అభివృద్ధి సాధిస్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రోత్సహించాల్సింది పోయి.. కేంద్రం అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేయాలని చూస్తుందన్న అంశాన్ని పార్లమెంట్ లో లేవనెత్తావని కేసీఆర్ సూచించనున్నారు. వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులతో తెలంగాణలో అంచనాకు ధాన్యం ఉత్పత్తి అవుతుందని కేసీఆర్ చెబుతున్నారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనకుండా, రైతులను మిల్లర్లను ప్రభుత్వాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల పై పోరాడాలని ఎంపీలకు, సిఎం కేసీఆర్ పిలుపునివ్వనున్నారని తెలుస్తోంది.
గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి తెలంగాణ విషయంలో కేంద్రం అనవసర కొర్రీలు వేస్తుందని కేసీఆర్ ఆరోపిస్తున్నారు. ఈ పథకం అమలులో కేంద్ర సర్కార్ తీరును ఎండగట్టాలని పార్టీ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్ధేశం చేయనున్నారని తెలుస్తోంది. తెలంగాణలో నరేగా పథకం గొప్పగా అమలు జరుగుతుందని గతంలో కేంద్రం ప్రశంసించింది. తెలంగాణలో జరుగుతున్న సోషల్ ఆడిట్ గురించి గొప్పగా చెప్పి అవార్డులు ఇచ్చిందని ఎంపీలకు చెప్పనున్నారు కేసీఆర్. కాని ఇప్పుడు మోడీ సర్కార్ మాట మార్చి తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న విషయాన్ని పార్లమెంట్ వేదికగా వెల్లడించాలని పార్టీ ఎంపీలకు సూచించినున్నారు సీఎం కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం అనాలోచిత విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకు దిగజారిపోతుందని, రూపాయి విలువ దారుణంగా పతనమతుందని కొన్ని రోజులుగా కేసీఆర్ ఆరోపిస్తున్నారు. రూపాయి పతనం పై కేంద్రాన్ని పార్లమెంట్ సాక్షిగా నిలదీయాలని టీఆర్ఎస్ ఎంపీలకు సిఎం కెసిఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
పరమత సహనం, శాంతి, సౌభ్రాతృత్వానికి నిలయమైన భారతదేశంలో కొన్ని రోజులుగా మత విద్వేషాలు పెరుగుతున్నాయని, దీనిపై మోడీ సర్కాప్ విధానాలే కారణమని సీఎం కేసీఆర్ విమర్శిస్తున్నారు. రాజ్యాం ఫెడరల్ స్పూర్తికి, సెక్యులర్ జీవన విధానానికి వ్యతిరేకంగా మోడీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలను ఉభయ సభల్లో ఎండగట్టాలని పార్టీ ఎంపీలకు సూచించినున్నారు సీఎం కేసీఆర్. బీజేపీపై పోరాటంలో తమతో కలిసివచ్చే ఇతర రాష్ట్రాల విపక్ష ఎంపీలను కూడా కలుపుకుని పోవాలని కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ ప్రజలు. దేశ ప్రజల తరఫున టిఆర్ఎస్ రాజ్యసభ, లోక్ సభ ఎంపీలు పార్లమెంటు ఉభయ సభల్లో బీజేపీ కేంద్ర ప్రభుత్వ అసంబద్ధ విధానాలను నిలదీస్తూ గళం విప్పాలని సిఎం కెసిఆర్ శనివారం జరగనున్న పార్టీ ఎంపీల సమావేశంలో సీఎం కేసీఆర్ పిలుపినున్నారు.
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook