Godavari Flood: రూ. వేల కోట్లు నీటి పాలు.. వరదల్లో మునిగిన కాళేశ్వరం బాహుబలి మోటార్లు.. కేసీఆర్ సిగ్గుపడాలన్న బండి సంజయ్

Godavari Flood: కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద పోటెత్తింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఊహించని వరద వచ్చింది. కన్నేపల్లి పంప హౌజ్ ను వరద ముంచెత్తింది. దీంతో కాళేశ్వరం బాహుబలి మోటర్లు జలమలమయ్యాయి. కన్నెపల్లి పంపు హౌస్‌లోకి భారీగా వరద  చేరడంతో 17 బాహుబలి మోటార్లు నీటిలో మునిగిపోయాయి. పంప్ మోటార్లపైన 10 మీటర్ల ఎత్తు వరకు నీరు చేరింది.

Written by - Srisailam | Last Updated : Jul 15, 2022, 10:42 AM IST
  • నీట మునిగిన కాళేశ్వరం పంప్ హౌజ్ లు
  • అన్నారం, సరస్వతి మోటార్లలోకి నీళ్లు
  • రిపేర్ల కోసం రూ. వెయి కోట్ల ఖర్చు?
Godavari Flood: రూ. వేల కోట్లు నీటి పాలు.. వరదల్లో మునిగిన కాళేశ్వరం బాహుబలి మోటార్లు.. కేసీఆర్ సిగ్గుపడాలన్న బండి సంజయ్

Godavari Flood: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలల ప్రాజెక్ట్ కాళేశ్వరం. దాదాపు లక్ష కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును గొప్పగా ప్రచారం చేసుకుంటుంది టీఆర్ఎస్ సర్కార్. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను నిర్మించి సీఎం కేసీఆర్ అపర భగీరథుడిలా చరిత్రలో నిలిచిపోతారని గులాబీ లీడర్లు చెబుతున్నారు. విపక్షాలు మాత్రం కాళేశ్వరం ప్రాజెక్ట్ ను వైట్ ఎలిఫెంట్ గా అభివర్ణిస్తున్నారు. కేసీఆర్ నిర్వాకంతో లక్ష కోట్ల రూపాయలు వృధా అయ్యాయని విమర్శిస్తున్నారు. విపక్షాలు ఆరోపిస్తున్నట్లే గత మూడేళ్లుగా కాళేశ్వరం మోటార్లు రన్ చేయలేదు. భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్ట్  నుంచి నీటిని ఎత్తిపోయాల్సిన అవసరం రాకుండా పోయింది. గత రెండేళ్లు వరదలకు ముందే 35 టీఎంసీల నీళ్లను ఎత్తిపోసినా... తర్వాత భారీ వర్షాలకు వరదలు కారవడంతో ఎత్తిపోసిన నీరంతా మళ్లీ నదిలో కలిసిపోయింది.

కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద పోటెత్తింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఊహించని వరద వచ్చింది. కన్నేపల్లి పంప హౌజ్ ను వరద ముంచెత్తింది. దీంతో కాళేశ్వరం బాహుబలి మోటర్లు జలమలమయ్యాయి. కన్నెపల్లి పంపు హౌస్‌లోకి భారీగా వరద  చేరడంతో 17 బాహుబలి మోటార్లు నీటిలో మునిగిపోయాయి. పంప్ మోటార్లపైన 10 మీటర్ల ఎత్తు వరకు నీరు చేరింది. మోటార్లను బురద ముంచెత్తింది.మోటార్లు రన్ చేయాలంటే నీటితో పాటు బురదను ఎత్తిపోయాల్సిన పరిస్థితి వచ్చింది. మోటార్లపైకి 10 మీటర్ల ఎత్తు వరకు నీరు చేరడంతో అపార నష్టం జరిగిందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. నీట మునిగిన మోటార్లన్ని బాహుబలి పంపులే. పెద్ద ఎత్తున బురద చేరడంతో మోటార్లను పూర్తిగా రిపేర్ చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. గతంలో  కల్వకుర్తి ప్రాజెక్టు పంప్ హౌజ్ లో నాలుగు మోటర్లు వరదలో మునిగితే... క్లీన్ చేసి రన్ చేసేందుకు దాదాపు మూడు నెలలు పట్టింది. అన్నారంలో మునిగినవి బాహుబలి మోటార్లు. బురదతో పాటు ఒండ్రుమట్టి భారీగా చేరింది.

ఈ బాహుబలి మోటర్ల రిపేర్ల కోసం వెయ్యి కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి రావచ్చని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. అటు మంథని మండం ఉన్న సరస్వతీ పంప్​ హౌస్​ కూడ నీట మునిగింది. మొత్తం 12 మోటర్లలోకి నీళ్లు చేరాయి ఈ మోటర్లను కూడా రిపేర్ చేశాకే రన్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఇవి కూడా మరో మూడు నెలల వరకు అందుబాటులో లేనట్టే. నీట మునిగిన కల్వకుర్తి మోటార్లను రిపేర్ చేసేందుకు మూడు నెలలు పట్టింది. బాహుబలి మోటార్ల మరమ్మత్తులకు ఇంకా ఎక్కువ సమయమే పట్టనుంది. దీంతో ఏడాది అన్నారం పంప్ హౌజ్ నుంచి నీటిని ఎత్తిపోయడం కష్టమేనని చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మోటార్లు నీట మునగడంతో సీఎం కేసీఆర్ పై విపక్షాలు మండిపడుతున్నాయి. తాము ముందు నుంచి భయపడుతున్నట్లే జరిగిందని... వేల కోట్ల రూపాయలను కేసీఆర్ నీటిపాలు చేశారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ మోటార్లు నీట మునగడంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. అపర భగీరథుడు, తెలంగాణలో నదులకు నడక నేర్పినోడు, ప్రపంచంలోనే అతిపెద్ద ఇంజినీరింగ్ నిపుణుడిని తానేనని గొప్పులు చెపుకున్నముఖ్యమంత్రి కేసీఆర్ సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు. కేసీఆర్ నిర్వాకం వల్ల వేల కోట్ల రూపాయలు వృధా అయ్యాయని చెప్పారు. కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల వల్లే మంథని, ధర్మపురి నియోజకవర్గాలు జలమయం అయ్యాయని బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ వైఫల్యం వల్లే కా అన్నారం పంప్ హౌజ్ నీట మునిగిందన్న సంజయ్.. అంచనాల వ్యయాన్ని పెంచి వేల కోట్లు దోచుకోవడంలో చూపిన శ్రద్ధ, ప్రాజెక్టు నిర్మాణంలో చూపకపోవడం సిగ్గు చేటు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.  వందల కోట్ల రూపాయలతో కొత్తగా నిర్మించిన సిరిసిల్ల, జనగాం జిల్లా కలెక్టరేట్ భవనాలు సైతం నీట మునిగిపోయయాని తెలిపారు. యాదాద్రి ఆలయ నిర్మాణాలు నీటికి వంగిపోవడం అత్యంత సిగ్గు చేటన్నారు. గోడలు నెర్రెలు పాయడం దారుణమని బండి సంజయ్ ధ్వజమెత్తారు.

Read also: Telangaan Floods:కాళేశ్వరం బ్యారేజీకి రివర్స్ వరద.. కంట్రోల్ రూమ్ లో చిక్కుకుపోయిన 105 మంది సిబ్బంది  

Read also: Gargi Movie Review: లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి నటించిన 'గార్గి' సినిమా ఎలా ఉందంటే!  

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News