Pratyusha`s marriage: ఘనంగా సీఎం కేసీఆర్ దత్తపుత్రిక వివాహం
CM KCR`s adopted daughter Pratyusha`s marriage | హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దత్తపుత్రిక ప్రత్యూష వివాహం ఘనంగా జరిగింది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాటిగడ్డ గ్రామంలోని అవర్ లేడీ ఆఫ్ లార్డ్స్ చర్చ్ ఈ పెళ్లి వేడుకకు వేదికైంది.
CM KCR's adopted daughter Pratyusha's marriage | హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దత్తపుత్రిక ప్రత్యూష వివాహం ఘనంగా జరిగింది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాటిగడ్డ గ్రామంలోని అవర్ లేడీ ఆఫ్ లార్డ్స్ చర్చ్ ఈ పెళ్లి వేడుకకు వేదికైంది. క్రైస్తవ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ పెళ్లి వేడుకకు షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, జడ్పీ వైస్-చైర్మన్ గణేష్, ఉమెన్ వెల్ఫేర్ కమిషనర్ దివ్య దేవరాజు, తదితర స్థానిక ప్రజాప్రతినిధులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. అంతకంటే ముందుగా ఆదివారం ప్రత్యూషను పెళ్లి కూతురు చేసే క్రమంలో జరిగిన వేడుకకు సీఎం కేసీఆర్ సతీమణి శోభ, మంత్రులు సభితా ఇంద్రా రెడ్డి, సత్యవతి రాథోడ్, సీఎం కేసీఆర్ కూతురు, నిజామాబాద్ ఎమ్మెల్సీ అయిన కవిత హాజరయ్యారు.
ప్రత్యూష తల్లిదండ్రులు ( Pratyusha's parents ) ఆమె చిన్నప్పుడే విడిపోగా... 2003లో ఆమె తల్లి చనిపోయారు. చనిపోయే ముందు ప్రత్యూష తల్లి తన పేరు మీద ఉన్న ఆస్తిపాస్తులన్నీ తన కూతురి పేరుపై రాసి చనిపోగా.. ఆ తర్వాత ప్రత్యూష తండ్రి ఆమెను ఓ సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లో చేర్పించారు. అనంతరం 2013లో ప్రత్యూషను ఆమె తండ్రి ఇంటికి తీసుకురాగా.. ఆస్తి కోసం ప్రత్యూష సవతి తల్లి ప్రత్యూషను వేధించి చిత్రహింసలకు గురిచేసింది. ప్రత్యూష అనుభవిస్తున్న ప్రత్యక్ష నరకం గురించి తెలుసుకున్న బాలల హక్కుల సంఘం.. 2015లో ఆమెను ఆ నరకం నుంచి కాపాడి బయటకు తీసుకురాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ బాలికను దత్తత ( CM KCR adopted Pratyusha as his daughter ) తీసుకున్నారు.
Also read : Rythu Bandhu: నేటినుంచి ‘రైతుబంధు’ సాయం పంపిణీ
ప్రత్యూషను చదివించి ఆమె జీవితంలో స్థిరపడేలా తానే అన్ని జాగ్రత్తలు తీసుకుంటానని అప్పట్లోనే సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2019లో నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన ప్రత్యూష.. ప్రస్తుతం ఓ ఆస్పత్రిలో పనిచేస్తోన్న సంగతి తెలిసిందే.
ప్రత్యూషకు పెళ్లి చేయాలని భావించిన సీఎం కేసీఆర్ ( CM KCR )... ఆమెకు రెండు నెలల క్రితమే ఓ సంబంధం చూసి పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ ప్రకారమె ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్న చరణ్ రెడ్డితో ( Pratyusha weds Charan Reddy ) 2 నెలల క్రితమే ప్రత్యూషకు ఎంగేజ్‌మెంట్ జరిగింది. శుక్రవారమే సీఎం కేసీఆర్ భార్య శోభమ్మ ( CM KCR's wife Shobhamma ) తమ దత్తత పుత్రిక ప్రత్యూషకు పెళ్లికోసం అవసరమైన నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు సమర్పించారు.
Also read : Double Bedroom అమ్మితే కేసు నమోదు చేస్తాం: హరీశ్‌రావు
https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe