Double Bedroom అమ్మితే కేసు నమోదు చేస్తాం: హరీశ్‌రావు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి పేదవారికి ఇస్తోందని.. అలాంటి ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై కేసు నమోదు చేస్తామని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు.

Last Updated : Dec 27, 2020, 05:26 PM IST
Double Bedroom అమ్మితే కేసు నమోదు చేస్తాం: హరీశ్‌రావు

Harish Rao warns to Double Bedroom Beneficiaries: హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి పేదవారికి ఇస్తోందని.. అలాంటి ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై కేసు నమోదు చేస్తామని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు డబుల్ బెడ్ రూం పథకాన్ని ప్రారంభించి పేదవారి కలను సాకారం చేస్తున్నారని హరీశ్‌రావు (Harish Rao) తెలిపారు. సిద్దిపేటలోని కేసీఆర్‌ కాలనీలో మరో 168 డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం పూర్తయ్యింది. వాటికి సంబంధించిన పట్టాలను మంత్రి హరీశ్‌రావు ఆదివారం (Double Bedroom Beneficiaries) లబ్దిదారులకు పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. ఉద్యోగి ఇల్లు నిర్మించుకున్నా.. ఎంతోకొంత అప్పు అవుతుందని.. ఎలాంటి అప్పు లేకుండానే పేదవారికి ఇంటి కలను (Double Bedroom Housing scheme ) డబుల్ బెడ్ రూం పథకంతో సీఎం కేసీఆర్ (CM KCR) నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు. అనర్హులు ఎవరైనా ఇల్లు తీసుకుంటే మరో పేదవాడికి అన్యాయం చేసినట్లేనని హరీశ్‌రావు తెలిపారు. Also Read: Rajinikanth: ఆసుపత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్‌

ప్రజలకు అతి ముఖ్యమైన ఇల్లు, పెళ్లికి తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) సహాయం చేస్తోందని.. వాటిని అర్హులే తీసుకోవాలని హరీశ్‌రావు కోరారు. అయితే తనను విమర్శించిన బీజేపీ కార్యకర్తకు కూడా ఇల్లు వచ్చిందని పేర్కొన్నారు. ఎవరైనా ప్రభుత్వం ఇచ్చిన ఇల్లును విక్రయిస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. Also Read: Covid-19: ఇదే చివరి మహమ్మారి కాదు: WHO

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News