CM Revanth Reddy Interesting Comments On Rythu Bandhu: తెలంగాణాలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఏడాదికి రెండు సార్లు రైతులకు పెట్టుబడి సహాయంను అందిస్తుంది. రెండు సీజన్ లలో కూడా రైతులకు ఏమాత్రం ఇబ్బంది కల్గకుండా, పొలం ఎవరిదొ వారి అకౌంట్ లో రైతు బంధు డబ్బులు పడేలా చర్యలు తీసుకున్నారు. అయితే.. ఇటీవల తెలంగాణాలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో తమదైన మార్కును చూపిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Teeth Whitening Tips: మీ దంతాలు పచ్చగా ఉన్నాయా..?.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే ముత్యాల్లా మెరుస్తాయి..


ఆరు గ్యారంటీల అమలు దిశగా చర్యలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్కీమ్ ల పేరిట డబ్బులను ఎంతో వెస్ట్ చేసిందని, ముఖ్యంగా రైతు బంధు పేరిట వేల ఏకరాలు ఉన్న వారిని పెట్టుబడి సాయం ఇవ్వడం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడి సహాయం అంటే పొలం తక్కువగా ఉండి, ఆ రైతుకు పండించేదుకుస్థోమత లేని వారికి ఇచ్చేది పెట్టుబడి సాయం. కానీ ఇక్కడ పూర్తిగా దానికి వ్యతిరేకంగా జరుగుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగానే రైతు బంధుపై అధ్యయనం చేయడానికి కమిటీని సైతం ఏర్పాటుచేశారు.


ఇదిలా ఉండగా.. ఇప్పటికే రైతు బంధుపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అనేక పర్యాయాలు పలు వ్యాఖ్యలు చేశారు. తాజాగా, సీఎం రేవంత్ రెడ్డి మరోసారి రైతు బంధు పెట్టుబడి సాయం పథకంపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గామారాయి. రైతు బంధు పెట్టుబడి సాయం.. ట్యాక్స్ లు కట్టేవారికి అవసరమా..? అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. కేవలం భూమిని సాయంచేసే రైతన్నలకు మాత్రమే ఈ సాయం ఉండాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.


Read More: Yashika Aannand: బోల్డ్ పిక్స్ తో మైండ్ బ్లాక్ చేస్తున్న యాషికా, ట్రెండింగ్ లో పిక్స్


దీనిలో వందల కోట్ల రూపాయలు వెస్ట్ అవుతున్నాయని, కార్లు, బంగ్లాలు ఉన్న వాళ్లకు పెట్టుబడి సాయం ఇచ్చి, గత ప్రభుత్వం తెలంగాణను పూర్తిగా అప్పులపాలు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. రైతు బంధుపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చించి, తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ జర్నలిస్టులతో జరిగిన చిట్ చాట్ కార్యక్రమంలో పై విధంగా వ్యాఖ్యలు చేశారు.  
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook