Jagan vs Revanth: వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి పార్టీ కండువా కప్పుకున్న వైఎస్ షర్మిల కుమారుడి వివాహానికి ఆహ్వానించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు, భేటీ అయిన కాస్సేపటికే రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్‌పై పరోక్షంగా నిందారోపణలు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఓ ప్రైవేట్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పొరుగు రాష్ట్రం ఏపీ గురించే ఎక్కువ ఆరోపణలు చేశారు. తెలంగాణ గురించి మాట్లాడకుండా ఏపీలో జగన్ పరిపాలన తీరు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరి గురించి ప్రస్తావించారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చాలా సమస్యలున్నాయని గుర్తు చేశారు. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత నుంచి ఇప్పటివరకూ వైఎస్ జగన్ తనకు ఫోన్ చేసి అభినందించలేదన్నారు. సాధారణంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఫోన్ చేసి అభినందిస్తుంటారని, కానీ వైఎస్ జగన్ నుంచి అలాంటి ఫోన్ కాల్ రాలేదన్నారు. 


సర్జరీ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శ కోసం స్వయంగా ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చిన జగన్..తనకు మాత్రం ఫోన్ చేయలేదన్నారు. నరేంద్ర మోదీ మరోసారి ముఖ్యమంత్రి కావాలన్నది జగన్ కోరిక అని, తాను మాత్రం రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే పట్టుదలతో ఉన్నానన్నారు. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని జగన్ ఆకాంక్షిస్తే తాను మాత్రం కేసీఆర్‌ను రాజకీయ ప్రత్యర్ధిగానే చూస్తానన్నారు. 


ఫోన్ చేసి అభినందించలేదనే చిన్న అంశాన్ని ఓ ఇంటర్వ్యూలో ఇలా బహిరంగంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలాంటి బాధ్యతలు అప్పగించకుండానే వైఎస్ షర్మిలను ఏపీ కాంగ్రెస్ నాయకురాలంటూ పదే పదే సంబోధించారు. 


Also read: Ayodhya Ram lalla: అయోధ్య రాముడిని రామ్‌లల్లాగా ఎందుకు పిలుస్తున్నారు, రాముడికి, రామ్‌లల్లాకు తేడా ఏంటి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook