TSCETS 2020: తెలంగాణలో ప్రవేశ పరీక్షల తేదీలు ఇవే..
తెలంగాణలో ప్రవేశపరీక్షల (entrance exams) తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఎట్టకేలకు ఖరారు చేసింది. కరోనా మహమ్మారి (Coronavirus) కారణంగా తెలంగాణలో కామన్ ఎంట్రన్స్ ఎక్సామ్స్ రెండుసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే.
Telangana Entrance Exams Dates Announced: హైదరాబాద్: తెలంగాణలో ప్రవేశపరీక్షల (entrance exams) తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఎట్టకేలకు ఖరారు చేసింది. కరోనా మహమ్మారి ( Coronavirus ) కారణంగా తెలంగాణలో కామన్ ఎంట్రన్స్ ఎక్సామ్స్ రెండుసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఎంసెట్ ( TS EAMCET 2020 ), పాలిసెట్ (TS POLYCET), ఈసెట్ (TS ECET) పలు ప్రవేశ పరీక్షల తేదీల నిర్ణయంపై ఈ నెల 10వ తేదీన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy).. అధికారులు, ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డితో చర్చించారు. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యామండలి, సాంకేతిక విద్యామండలి శనివారం తేదీలు ప్రకటించాయి. ఆగస్టు 31 నుంచి అక్టోబరు 4వ తేదీ వరకు జరిగే ఈ ప్రవేశ పరీక్షలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి సుమారు 4లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. JEE మెయిన్స్, NEET హాల్ టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
ప్రవేశ పరీక్షల తేదీల వివరాలు..
ఈసెట్ ఆగస్టు 31న
ఎంసెట్ (ఇంజినీరింగ్) సెప్టెంబరు 9, 10, 11, 14 తేదీల్లో
పీజీఈసెట్ సెప్టెంబరు 21, 22, 23, 24 తేదీల్లో
ఎంసెట్ (అగ్రికల్చర్) సెప్టెంబరు 28, 29 తేదీల్లో
ఐసెట్ సెప్టెంబరు 30, అక్టోబరు 1వ తేదీల్లో
ఎడ్‌సెట్ అక్టోబరు 1, 3 తేదీల్లో
లాసెట్ అక్టోబరు 4న
సెప్టెంబరు 2న పాలిసెట్
ఇదిలాఉంటే.. పాలిసెట్ సెప్టెంబరు 2న పాలిసెట్‌ను నిర్వహించనున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యామండలి కార్యదర్శి సీ శ్రీనాథ్ తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 జరగనుంది. ఐటీఐ విద్యార్థులు పాలిటెక్నిక్‌లో లాటరల్ ఎంట్రీ ద్వారా డైరెక్ట్‌గా రెండో ఏడాదిలోకి చేరేందుకు ఎల్‌పీసెట్ సెప్టెంబరు 6న నిర్వహిస్తున్నట్లు చెప్పారు. SOP For Movie Shootings: సినిమా షూటింగ్‌లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్