Revanth Reddy: రేవంత్ రెడ్డితో ఉండలేం.. కాంగ్రెస్‌కు మరో సీనియర్ నేత రాజీనామా?
Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ లో ముసలం కొనసాగుతోంది. సీనియర్లు ఒక్కొక్కరుగా బయటికి వస్తూ తమ గళం వినిపిస్తున్నారు. అసమ్మతి వాయిస్ వినిపిస్తున్న నేతలంతా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న సీనియర్ నేత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నారని తెలుస్తోంది.
Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ లో ముసలం కొనసాగుతోంది. సీనియర్లు ఒక్కొక్కరుగా బయటికి వస్తూ తమ గళం వినిపిస్తున్నారు. అసమ్మతి వాయిస్ వినిపిస్తున్న నేతలంతా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డినే టార్గెట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న సీనియర్ నేత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నారని తెలుస్తోంది. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి బాటలోనే కాంగ్రెస్ సీనియర్ నేత, ఏఐసీసీ కార్యాక్రమాల అమలు కమిటీ చైర్మెన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి పయనించనున్నారని సమాచారం. కాంగ్రెస్ పార్టీకి త్వరలోనే ఏలేటీ గుడ్ బై చెప్పనున్నారని తెలుస్తోంది. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మెన్ గా ఉన్న తనకు తెలియకుండానే పార్టీలో కార్యక్రమాలు జరుగుుతన్నాయని, తనకు కనీస సమాచారం ఇవ్వడం లేదని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపిస్తున్నారు.
గతంలోనూ మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేస్తారనే ప్రచారం జరిగింది. కాని పీసీసీ పెద్దలు బుజ్జగించడంతో వెనక్కి తగ్గారు. అయితే ఈనెల 21న బీజేపీలో చేరనున్న సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో ఏలేటి మహేశ్వర్ రెడ్డికి దగ్గరి బంధుత్వం ఉంది. ఈ నేపథ్యంలో మహేశ్వర్ రెడ్డితో రాజగోపాల్ రెడ్డితో పాటు బీజేపీ చేరికల కమిటి కన్వీనర్ ఈటల రాజేందర్ చర్చలు జరిపారని తెలుస్తోంది. చర్చలు సఫలం కావడంతో త్వరలోనే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కషాయ కండువా కప్పుకోవడం ఖాయమని తెలుస్తోంది.
మరోవైపు పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్ లో పీసీసీ ముఖ్య నేతలతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ సమావేశం అయిన సమయంలోనే రేవంత్ రెడ్జిని ఆయన తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు. కోమటిరెడ్డి సోదరుల విషయంలో రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు సరికాదన్నారు. హోంగార్డ్ కామెంట్లను తప్పుపట్టారు. రేవంత్ రెడ్డి దృష్టిలో తామంతా హోంగార్డులమా అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి ఏజెంట్‌గా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ మారిపోయారని మర్రి శశిధర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. సీనియర్లను గోడకేసి కొడతానన్నా రేవంత్ రెడ్డిని అధిష్టానం మందలించలేదన్నారు. పార్టీ నడిపిస్తున్నవారే కల్లోలానికి కారణమయితే ఇంకా ఎవరేం చేస్తారని శశిధర్ రెడ్డి అన్నారు. పార్టీలో కూల్ నేతగా ఉన్న శశిధర్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి.
Read Also: Kaleshwaram Project: వైట్ ఎలిఫెంట్ గా మారిన కాళేశ్వరం.. మూడేళ్లలో రూ.3,600 కోట్ల కరెంట్ బిల్లు
Read Also: Vizag Serial Killer: వరుస హత్యలతో విశాఖ వాసులను బెంబేలెత్తించిన సీరియల్ కిల్లర్ అరెస్ట్...
Also Read: Weight Loss Tips: ఈ ఆహార నియమాలు పాటిస్తే ఖచ్చితంగా మీరు 12 రోజుల్లో బరువు తగ్గుతారు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook