Telangana congress: రాబోయే ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణ కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది. ఆ దిశగా వ్యూహా రచన చేస్తోంది. ఏఐసీసీ నిర్వహించిన చింతన్ శిబిర్‌ సక్సెస్‌ను స్ఫూర్తిగా తీసుకుని అదే తరహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. వచ్చే నెల 1, 2 తేదీల్లో మేడ్చల్ జిల్లా కీసర దగ్గర బాల వికాస్‌లో చింతన్ శిబిర్ నిర్వహించాలని నిర్ణయించారు. చింతన్‌ శిబిర్‌ ఏర్పాట్లపై ముఖ్య నేతలు దృష్టి పెట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2023 ఎన్నికలే లక్ష్యంగా చింతన్ శిబిర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈసమావేశంలో ఆ పార్టీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. పార్టీ బలోపేతంపై నేతలు ఇచ్చే సూచనలు, అభిప్రాయాలను తీసుకోనున్నారు. రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌లోని చింతన్ శిబిర్‌లో తీసుకున్న జాతీయ స్థాయి అంశాలు, రాష్ట్ర సమస్యలను క్రోడీకరించి రోడ్‌ మ్యాప్‌ తయారు చేయనున్నారు. ఉదయ్‌పూర్‌ చింతన్ శిబిర్‌ కోసం ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆరు గ్రూపులను ఏర్పాటు చేశారు.


సీడబ్ల్యూసీలో వీటిపై చర్చించి..విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నారు. అదే విధంగా తెలంగాణలోని పరిస్థితులపై లోతుగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వడానికి ఆరు కమిటీలను టీపీసీసీ నేతలు ఏర్పాటు చేశారు. ఆర్థికం, రాజకీయ, ఆర్గనైజేషన్‌, వ్యవసాయం వంటి గ్రూప్‌లకు సీనియర్ నేతలు కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. కమిటీలు ఇచ్చే నివేదికలపై కాంగ్రెస్‌ నేతలంతా చర్చించి..ఓ పాలసీని ప్రకటించనున్నారు.


చింతన్ శిబిర్‌లో తొలిరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై చర్చ ఉంటుంది. పార్టీ బలోపేతం, భవిష్యత్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై సెషన్‌ ఉండనుంది. తెలంగాణలో వ్యవసాయ పరిస్థితులపై కూడా నేతలు చర్చించనున్నారు. రెండోరోజు 6 అంశాలపై వచ్చిన నివేదిక ఆధారంగా డిక్లరేషన్‌ను నేతలు ప్రకటించనున్నారు. చింతన్‌ శిబిర్‌లో తీసుకున్న నిర్ణయాలను క్షేత్ర స్థాయిలోకి ఎలా తీసుకెళ్లాలన్న దానిపై సుదీర్ఘ చర్చ ఉంటుందని నేతలు తెలిపారు. కీసరలో జరిగే చింతన్ శిబిర్‌లో ఏఐసీసీ ముఖ్యనేతలతోపాటు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు పాల్గొననున్నారు.


Also read: YSRCP MLC WARNING: అచ్చెన్నాయుడిని గుడ్డలూడదీసి కొడతా.. వైసీపీ ఎమ్మెల్సీ ఓపెన్ వార్నింగ్ 


Also read:Weight Loss Tips: ఈ చిట్కా వాడితే కొద్దిరోజుల్లోనే బరువు ఇట్టే తగ్గిపోతారు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


 


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook