Revanth Reddy: వరదల నేపథ్యంలో ప్రధాని మోదీకి తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షులు, ఎంపీ రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలోని వరదల పరిస్థితిని లేఖలో వివరించారు. వరదలతో తెలంగాణ అతలాకుతలమవుతోందన్నారు. రాష్ట్రంలో వరదల పరిస్థితిని జాతీయ విపత్తుగా పరిగణించాలని కోరారు. వరదల కారణంగా తెలంగాణలో 11 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు నీట మునిగాయని తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వరద ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో వరద పరిస్థితిని అంచనా వేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందన్నారు రేవంత్‌రెడ్డి. వంద ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా వరదలు వచ్చాయని లేఖలో వివరించారు. ఈవిషయాన్ని సీఎం కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ పైకి రాకుండా చూస్తున్నారని ఆరోపించారు. ఇంత నష్టం జరిగినా ఏం జరగలేదంటూ కేటీఆర్ వ్యాఖ్యనిచ్చడం ఆవివేకమన్నారు. 


క్షేత్రస్థాయిలో పర్యటిస్తే వాస్తవ పరిస్థితి అర్థమవుతుందన్నారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పర్యటించేందుకు రావాలని కేటీఆర్ సవాల్‌ విసిరిన విషయాన్ని ప్రధాని మోదీకి రాసిన లేఖలో ప్రస్తావించారు. గోదావరి ఉధృతికి కడెం ప్రాజెక్ట్ ఉనికి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి రూ.1.52 లక్షల కోట్లు కేటాయించామని చెబుతున్నా..క్షేత్రస్థాయిలో ఇవేమి కనిపించడం లేదన్నారు రేవంత్‌రెడ్డి. వరద కారణంగా కాళేశ్వరంలోని రెండు కీలక పంప్‌ హౌజ్‌లు నీట మునిగాయన్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నారు. కేసీఆర్..అనాలోచిత విధానాలు, అర్థపర్థం లేని డిజైన్ల పరిస్థితి ఇందుకు కారణమని లేఖలో ఆరోపించారు.


Also read:Rain Alert: తెలుగు రాష్ట్రాలకు మరోసారి రెయిన్ అలర్ట్..లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే..!


Also read:Harish Rao Review: ముంపు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండండి..వైద్యాధికారులకు హరీష్‌రావు ఆదేశం..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook