Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు (టీపీసీసీ చీఫ్​), ఎంపీ రేవంత్​ రెడ్డి మరోసారి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ట్విట్టర్ ఖాతా ద్వారా (Revanth Reddy tested positive) వెల్లడించారు. జ్వరం, సల్ప కొవిడ్ లక్షణాలు ఉన్నట్లు చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రేవంత్​ రెడ్డికి కరోనా సోకడం ఇది రెండో సారి కావడం గమనార్హం. గత ఏడాది మార్చిలోను ఆయన కరోనా బారిన పడ్డారు. అప్పుడు కూడా స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని వెల్లడించారు.


ప్రస్తుతం. ప్రస్తుతం తాను ఐసోలేషన్​లో ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు.


ఇటీవలి కాలంలో రేవంత్​ రెడ్డి వివిధ కార్యక్రమాలకు హాజరయ్యారు. రచ్చబండ కార్యక్రమాన్ని తలపెట్టగా.. పోలీసులు ఆయన్ను హౌస్​ అరెస్ట్ చేశారు. ఈ పరిస్థితులన నడుమ ఆయన పార్టీ శ్రేణుల్లో పలువురిని కలిశారు. కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఆయన్ను కలిశారు.


ఈ నేపథ్యంలో ఇటీవలి కాలంలో తనను కలిసిన ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు పాటించాలని రేవంత్​ రెడ్డి సూచించారు.


దేశంలో కొవిడ్ విజృంభణ..


దేశంలో మళ్లీ కరోనా వైరస్ తీవ్ర రూపం దాల్చుతోంది. కేసులు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. రెండు డోసుల టీకా తీసకున్న వారికీ కరోనా సోకుతుండటం ఆందోళన కలిగిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.


Also read: Fire accident: కేపీహెచ్​బీలో భారీ అగ్నిప్రమాదం- పూర్తిగా కాలిపోయిన థియేటర్!


Also read: Corona in Telangana: తెలంగాణలో కొత్తగా మరో 5 ఒమిక్రాన్ కేసులు- మొత్తం @ 84


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook