K Keshavarao: కన్నీళ్లు పెట్టుకున్న కే కేశవరావు.. ఉగాది రోజున నీ కొడుకు ఇక మీదట చనిపోయాడని మెస్సెజ్..
K Keshavarao: కాంగ్రెస్ నేత కే కేశవరావు బీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ వల్ల తన కుటుంబంలో చీలికలు వచ్చాయని కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు బీఆర్ఎస్ లో చెప్పుకునేంత గౌరవం దక్కలేదని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు.
K Keshava Rao Fires On BRS And KTR: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం సంచలనఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈక్రమంలోనే లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న కొలది అనేక మంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కండువ కప్పుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ రంజిత్ రెడ్డి,కడియం శ్రీహరి, కే కేశవరావు, హైదరబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అధికారం, హోదాలను అనుభవించి తీరా పార్టీ మారక మాత్రం.. ఈవిధంగా అధికార కాంగ్రెస్ లోకి దూకడం పట్ల పలువురు బీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే వీరిందరిని విమర్శించారు. కేవలం తమ రాజకీయ జీవితం కోసం, అక్రమాలు ఎక్కడ బైటపడతాయోనని,ఇలా అధికార కాంగ్రెస్ లోకి వెళ్లారంటూ ఎద్దేవా చేశారు.
ఇదిలా ఉండగా.. ముఖ్యంగా కే కేశవరావు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ వల్ల తమ కుటుంబంలో చీలిక వచ్చిందని అన్నారు. ఉగాది పండుగ రోజున తన కన్న కొడుకు ఇక మీదట నీకు లేడు..చనిపోయాడంటూ మెసెలు పెట్టాడని కన్నీటి పర్యంటమయ్యారు. అంతేకాకుండా.. బీఆర్ఎస్ వల్ల తనకు ఓరిగిందేమని లేదన్నారు. కాంగ్రెస్ లో సీనియర్ నేత అనే గుర్తింపు ఉండేది.. బీఆర్ఎస్ లో అది కూడా లేదన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలు తనకు కన్నీళ్లు తెప్పస్తున్నాయని, పార్టీ చైర్మన్ పదవి అడిగితే ఇవ్వనన్నారని పేర్కొన్నారు.
తనకుమారుడు విప్లవ్ కు ఎమ్మెల్సీ అడిగిన కూడా ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ ను తన సొంత పార్టీగా భావించా.. కానీ పండగ రోజున మీ కొడుకు చనిపోయాడని అనుకోండి అంటూ మెసెజ్ లు పెట్టించారని కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను కుటుంబాలను విచ్ఛిన్నం చేసే రాజకీయాలు ఎప్పుడు చేయలేదన్నారు. సొంత కొడుకు నుంచి ఇలాంటి మెస్సెజ్ లు రావడం మాత్రం భరించలేకుండా ఉన్నానంటూ చిన్నపిల్లాడిలా రోదించారు.
Read More: CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రకు బ్రేక్.. నుదుటి భాగంలో కుట్లు పడే అవకాశం.?..
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొందరు కే కేశవరావును సమర్థిస్తుండగా... మరికొందరు మాత్రం ఇవన్ని వట్టి డ్రామాలని కొట్టిపారేస్తున్నారు. ఇక తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారంను ఆయా పార్టీలు జోరుగా నిర్వహిస్తున్నారు. ఎన్నికలలో నువ్వా... నేనా అన్న విధంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter