హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు ( COVID-19 positive cases ) మళ్లీ అంతకంతకూ పెరుగుతుండటం ఆందోళనరేకెత్తిస్తోంది. సోమవారం తెలంగాణలో 79 కరోనావైరస్ పాజిటివ్‌ కేసులు నమోదవడమే అందుకు కారణమైంది. జీహెచ్ఎంసీ ( GHMC ) పరిధిలోనే ఈ కేసులన్నీ నమోదవడం నగరవాసులను మరింత కలవరానికి గురిచేస్తోంది. సోమవారం నాటి కేసులతో కలిసి ఇప్పటివరకు కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య మొత్తం 1275 కు చేరింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌ ( Health Bulletin ) ద్వారా ఈ వివరాలు వెల్లడించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : భైంసా అల్లర్లు : తెలంగాణ సర్కార్‌కి బీజేపీ ఎంపీ హెచ్చరిక


కరోనావైరస్ నుంచి ఇవాళ 50 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. వీరితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 801 మంది కోవిడ్-19 నుంచి నయమై డిశ్చార్జ్‌ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 444 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా జారీ చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..