Telangana: తెలంగాణలో కరోనా కేసులపై లేటెస్ట్ హెల్త్ బులెటిన్
హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 3,821 కరోనా పాజిటివ్ కేసులు (Covid-19 cases) నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య మొత్తం 5,60,141 కి చేరింది.
హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 3,821 కరోనా పాజిటివ్ కేసులు (Covid-19 cases) నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య మొత్తం 5,60,141 కి చేరింది. అదే సమయంలో మరో 23 మంది కరోనాతో మృతి చెందారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య మొత్తం 3,169 కి చేరింది.
తెలంగాణలో గత 24 గంటల్లో 4,298 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 38,706 యాక్టివ్ కేసులు ఉన్నాయని తాజా హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు.
Also read : COVID-19 vaccine కి ముందు లేదా తర్వాత alcohol తీసుకోవచ్చా ? Side effects ఏంటి ?
తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం జీహెచ్‌ఎంసీ (GHMC) పరిధిలో అత్యధికంగా 537 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఖమ్మం జిల్లాలో 245, రంగారెడ్డి 226 జిల్లాలో, మేడ్చల్ జిల్లాలో 215, సూర్యాపేట జిల్లా 214, నల్గొండ జిల్లా 187, కరీంనగర్ జిల్లాలో 172, పెద్దపల్లి జిల్లాలో 147, వరంగల్ అర్బన్ జిల్లాలో 146, నాగర్ కర్నూల్ జిల్లాలో 132 కేసులు నమోదయ్యాయి. అలాగే మహబూబ్‌నగర్ జిల్లాలో 128, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాల్లో 116 చొప్పున కరోనా కేసులు గుర్తించినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇదిలావుంటే, మరోవైపు తెలంగాణలో అక్కడక్కడా వెలుగుచూస్తున్న బ్లాక్ ఫంగస్ కేసులపైనా (Black fungus cases in Telangana) రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారిస్తోంది. ఎప్పటికప్పుడు జిల్లా వైద్యాధికారుల నుంచి నివేదికలు తెప్పించుకుంటూ పరిస్థితిని సమీక్షిస్తోంది.
Also read : Super Spreaders: కోవిడ్-19 వ్యాక్సినేషన్, Telangana ప్రభుత్వం కీలక నిర్ణయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook