CM KCR review meeting: లాక్‌డౌన్, కొవిడ్-19, బ్లాక్ ఫంగస్, వ్యాక్సినేషన్ అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్ష.. ముఖ్యాంశాలు

Lockdown, COVID-19, black fungus, vaccination in Telangana: హైదరాబాద్: తెలంగాణలో కరోనాను కట్టడి చేసేందుకు ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. జ్వర సర్వే ద్వారా మెడికల్ కిట్లు అందేంచే విధానాన్ని కొనసాగిస్తూనే, మరోవైపు కరోనా పరీక్షలను పెంచడం ద్వారా కరోనాను కట్టడి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కరోనా కట్టడి, బ్లాక్ ఫంగస్, కొవిడ్-19 వాక్సిన్, లాక్‌డౌన్ అమలు తదితర అంశాలపై సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 25, 2021, 05:34 AM IST
CM KCR review meeting: లాక్‌డౌన్, కొవిడ్-19, బ్లాక్ ఫంగస్, వ్యాక్సినేషన్ అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్ష.. ముఖ్యాంశాలు

Lockdown, COVID-19, black fungus, vaccination in Telangana: హైదరాబాద్: తెలంగాణలో కరోనాను కట్టడి చేసేందుకు ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. జ్వర సర్వే ద్వారా మెడికల్ కిట్లు అందేంచే విధానాన్ని కొనసాగిస్తూనే, మరోవైపు కరోనా పరీక్షలను పెంచడం ద్వారా కరోనాను కట్టడి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇంటింటికీ జ్వర సర్వే నిర్వహిస్తూ మెడికల్ కిట్లను అందించే కార్యక్రమం సత్పలితాలిస్తున్నదని, దేశంలో ఇలా మరెక్కడా జరగడం లేదని అన్నారు.

కరోనా పరీక్షలు చేయడానికి అవసరమైన ర్యాపిడ్ యాంటీ జెన్ టెస్టు కిట్ల సంఖ్యను తక్షణమే పెంచాలని అధికారులకు సూచించారు. మంగళవారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని వైద్య కేంద్రాల్లో ఇప్పుడు ఇస్తున్న కిట్ల సంఖ్యను పెంచాలని, అవసరమైతే అందుకోసం టెస్టింగ్ కిట్స్ ఉత్పత్తిదారులను సంప్రదించి సరఫరాను పెంచాలని తెలిపారు. కరోనా కట్టడి, బ్లాక్ ఫంగస్, కొవిడ్-19 వాక్సిన్, లాక్‌డౌన్ అమలు తదితర అంశాలపై సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన సందర్భంగా అధికారులకు ఈ ఆదేశాలు జారీచేశారు.

Black fungus treatment: బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఏర్పాట్లు..
బ్లాక్ ఫంగస్ వ్యాధి చికిత్సకోసం ఆస్పత్రుల్లో ప్రత్యేక బెడ్ల ఏర్పాటు, చికిత్సకు అవసరమైన మందులను తక్షణమే సమకూర్చుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. 

Also read: COVID-19 Vaccination: అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ లేకున్నా.. వ్యాక్సిన్ తీసుకోవచ్చు

COVID-19 tests: కరోనా పరీక్షలకు వచ్చే వాళ్లను వెనక్కి పంపొద్దు..
కరోనా పరీక్షల కోసం వచ్చే వాళ్లందరికీ పరీక్షలు నిర్వహించాలి. పరీక్షల కోసం వచ్చే వారిలో అధిక శాతం అత్యంత నిరుపేదలు ఉంటారు కనుక ఏ కారణంతోనూ, ఏ ఒక్కరికీ పరీక్ష నిరాకరించకూడదు అని సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

Medical staff recruitment: మెడికల్ స్టాఫ్ ఖాళీల భర్తీ వేగవంతం..
వైద్య కేంద్రాల్లో ఉన్న ఖాళీలను గుర్తించి తక్షణమే అవసరాల మేరకు సిబ్బందిని నియమించుకోవాలని కలెక్టర్లకు, జిల్లా వైద్యాధికారులకు గతంలోనే అధికారాలిచ్చిన ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసిన సీఎం కేసీఆర్.. ఆయా ఖాళీలను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని ఆదేశించారు. కరోనాను కట్టడి చేసేందుకు ఎంతటి ఖర్చుకైనా వెనకాడే ప్రసక్తే లేదని.. అందుకు అనుగుణంగా చర్యలు ఉండాలని సీఎం కేసీఆర్ అధికారులకు తేల్చిచెప్పారు.

Lockdown in Telangana: లాక్‌డౌన్ సత్ఫలితాలు ఇస్తోంది..
రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలు గురించి ప్రస్తావిస్తూ.. లాక్‌డౌన్‌తో కరోనాను కట్టడి చేయడంలో విజయం సాధించిన ఢిల్లీ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో చేపట్టిన చర్యలను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఢిల్లీ, మహారాష్ట్రల్లో కరోనా నియంత్రణలోకి వస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు వాళ్లు తీసుకుంటున్న చర్యలేంటో తెలుసుకునే ప్రయత్నం చేయండి అని సూచించిన సీఎం కేసీఆర్... మంచి ఎక్కడినుంచి నేర్చుకోవడానికైనా వెనుకాడాల్సిన అవసరం లేదు అని అభిప్రాయపడ్డారు.

Also read : TRS MLA Bethi Subhash Reddy: ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి.. అప్పుడలా.. ఇప్పుడిలా..

COVID-19 vaccine second dose:  
కరోనా ఫస్ట్ డోస్ తీసుకుని సెకండ్ డోస్ కోసం ఎదురుచూస్తున్న వాళ్ల సంఖ్య భారీగా ఉన్నందున వాళ్లందరికీ సరిపోయే స్థాయిలో వాక్సిన్లను తక్షణమే సరఫరా చేయాల్సిందిగా సంబంధిత వాక్సిన్ తయారీదారులతో మాట్లాడాల్సిందిగా కరోనా టాస్క్‌ఫోర్స్ చైర్మన్, మంత్రి కేటిఆర్‌ను ఆదేశించారు. 

Corona third wave: కరోనా థర్డ్ వేవ్ వస్తే...
ఒకవేళ కరోనా థర్డ్ వేవ్ వచ్చినా సరే ఆ సమస్యను ఎదుర్కునేందుకు అన్నివిధాల సంసిద్దంగా ఉండాలని అన్ని అత్యవసర సేవల శాఖల మంత్రులు, ఉన్నతాధికారులకు సీఎం కేసీఆర్ (CM KCR) సూచించారు.

Also read : Ayush Report: కృష్ణపట్నం మందుతో ఎలాంటి ప్రమాదం లేదు, ముఖ్యమంత్రి చేతికి నివేదిక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News