Covid Cases in Telangana: దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. ఈసారి కొవిడ్ తన రూపాన్ని మార్చుకుని జేఎన్ 1 వేరియంట్ రూపంలో వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా క్రమంగా కేసులు అధికమవుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా తెలంగాణలో 12 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. వీటితో పాటు జయశంకర్ భూపాలపల్లి ( Jayashankar Bhupalapally) జిల్లా గణపరం మండలం గాంధీనగర్ గ్రామంలో ఒకే ఇంట్లో ఐదుగురికి వైరస్ పాజిటివ్ గా తేలింది. దీంతో వారందరూ హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రస్తుతం పాజిటివ్ గా వచ్చినవారి ఆరోగ్యం నిలకడగా ఉందని డీఎంహెచ్ఓ మధుసూదన్ తెలిపారు. అయితే వారితో కాంటాక్ట్ అయిన వారు వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని వారు సూచించారు. రాష్ట్రంలో నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ లో నమోదవుతున్నాయి. మరో ఆరు రోజుల్లో న్యూఇయర్ రాబోతున్న నేపథ్యంలో కేసులు మరింత పెరిగే అవకాశం ఉంది.


ఏపీలో కొత్తగా 12 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఎక్కువగా ఎన్టీఆర్ జిల్లాలో 5, విశాఖపట్నంలో 3, కాకినాడలో 2, బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 2, తూర్పు గోదావరి జిల్లాలో 1 చొప్పున కేసులు నమోదయ్యాయి. మరోవైపు దేశంలో కొత్తగా 628 కేసులు వెలుగు చూశాయి. ఒక్క  కేరళలోనూ 128 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 4వేలు దాటింది. మరణాలు కూడా ఎక్కువగా కేరళలోని రికార్డుయ్యాయి. 


Also Read: Congress Vs BRS: కొత్త ప్రభుత్వం రాకతో సీన్ రివర్స్.. అంతలోనే ఏమైంది..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి