Telangana covid updates, telangana records 2,983 new cases of covid-19, two deaths: తెలంగాణలో కోవిడ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,07,904 కొవిడ్ టెస్ట్‌లు చేయగా, కొత్తగా 2,983 కొవిడ్ పాజిటివ్‌ కేసులు (Covid positive‌ cases) నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో (telangana) మొత్తం ఇప్పటి వరకు నమోదైన కొవిడ్ కేసుల సంఖ్య 7,14,639కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఒక బులిటెన్‌ రిలీజ్ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత 24 గంటల వ్యవధిలో తెలంగాణలో (Telangana) కొవిడ్ వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇప్పటి వరకు తెలంగాణలో కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,062కి చేరింది. కోవిడ్ బారి నుంచి తాజాగా 2,706 మంది కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 22,472 కొవిడ్ యాక్టివ్‌ కేసులు (Covid Active‌ Cases) ఉన్నాయి.


అయితే కరోనా (Corona) ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నందున వచ్చే మూడు వారాలు చాలా కీలకమని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. నారాయణపేట జిల్లా కోయిల్‌కొండలో మంత్రి మాట్లాడారు. అందరూ కచ్చితంగా మాస్కు ధరించాలని మంత్రి సూచించారు. ప్రైవేట్ హాస్పిటల్స్‌కు (Private Hospitals‌) వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని సూచించారు. ఏఎన్‌ఎం సబ్‌సెంటర్‌, పీహెచ్‌సీ, ప్రభుత్వ దవాఖానాల్లో ఎక్కడికైనా సరే కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవచ్చన్నారు. 


Also Read : AP Corona Cases: ఆంధ్రప్రదేశ్ లో పెరిగిన కరోనా ఉద్ధృతి.. కొత్తగా 6,996 కరోనా కేసులు


ఎంతమందికి కొవిడ్ (Covid) వచ్చినా మందులు ఇచ్చేందుకు వైద్య సిబ్బంది సిద్ధంగా ఉదంటూ మంత్రి చెప్పుకొచ్చారు. తెలంగాణలో రెండు కోట్ల కొవిడ్‌ (Covid) టెస్టింగ్ ఎక్విప్‌మెంట్‌ సిద్ధంగా ఉందన్నారు. అలాగే కోటి మందికి సరిపడే హోం ఐసోలేషన్‌ (Home Isolation‌) కిట్స్ కూడా అందుబాటులో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. అందరూ కచ్చితంగా వ్యాక్సిన్‌ (Vaccine‌) తీసుకోవాలి అని సూచించారు.


Also Read : Andhra Pradesh Education : ఏపీలో పాఠశాలలను కొనసాగించడానికి కారణం అదే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook