TS EAMCET: తెలంగాణలో ఎంసెట్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాలో కుండపోతగా వాన కురిసింది. తెలంగాణకు మరో మూడు రోజులు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఎనిమిది జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మంగళ, బుధ వారాల్లో కొన్ని జిల్లాల్లో కుండపోతగా వర్షం కురుస్తుందని వెల్లడించింది. తెలంగాణలో ఈనెల 14 గురువారం నుంచి 20వ తేదీ వరకు ఎంసెట్ జరగాల్సి ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారీ వర్షాలు శుక్రవారం వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయన్న ఐఎండీ హెచ్చరికలతో  ఎంసెట్ (TS EAMCET) నిర్వహణపై ప్రభుత్వం ఆలోచన చేస్తుందని తెలుస్తోంది. భారీ వర్షాలతో పలు జిల్లాల్లో ఇప్పటికీ ఏర్పాట్లు మొదలు కాలేదు. భారీ వర్షాలు కురిస్తే ఎంసెట్ నిర్వహణ కష్టమవుతుంది. ఆన్ లైన్ లో జరిగే పరీక్ష కావడంతో ఇంటర్ నెట్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని అధికారులు భయపడుతున్నారు. పలు జిల్లాలో ఎంసెట్ సెంటర్లు జలమయం అయ్యాయని తెలుస్తోంది. ఏజెన్సీ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. అక్కడి నుంచి వచ్చే  విద్యార్థులకు కష్టంగా మారనుంది. ఇవన్ని పరిశీలించాకే ఎంసెట్ ను వాయిదా వేసే యోచనకు విద్యాశాఖ అధికారులు వచ్చారని తెలుస్తోంది. ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత ఎంసెట్(TS EAMCET) వాయిదాపై అధికారికంగా నిర్ణయం ప్రకటించనున్నారు.


తెలంగాణ ఎంసెట్ (TS EAMCET)కు ఈ ఏడాది భారీ స్పందన వచ్చింది. ఇంజనీరింగ్ కు లక్షా 71 వేల 500 దరఖాస్తులు.. అగ్రికల్చర్ కు 94 వేల 047 దరఖాస్తులు వచ్చాయి. జూన్ 25 నుంచి వెబ్ సైట్ లో హాట్ టికెట్లు అందుబాటులో ఉంచారు.  eamcet.tsche.ac.in నుంచి ఎంసెట్ అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌ లోడ్ చేసుకున్నారు. జులై 14, 15 తేదీల్లో అగ్రికల్చర్‌, మెడిసన్‌, 18, 19, 20 వరకు ఇంజినీరింగ్‌ ఎంసెట్‌ పరీక్షలు జరగాల్సి ఉంది.


READ ALSO: Telangana Elections: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయమా? కేసీఆర్ డేట్ ఫిక్స్ చేసేశారా?


READ ALSO: Telangana Rain ALERT: గోదావరి ఉగ్రరూపం.. పోలవరం ప్రాజెక్టుకు గండం? భద్రాచలంలో రెండో ప్రమాద హెచ్చరిక



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook